12 నెలల తర్వాత త్వరలో వీరికి డబ్బుల మూటలు సిద్ధం చేసిన శుక్రుడు

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం ద్వాదశ రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. గ్రహాలలో ముఖ్య గ్రహమైన సంపదలకు, విలాసాలకు మూల కారకుడైన శుక్రుడు ప్రతినెల తన రాశిని మార్చుకుంటూ సంచారం చేస్తూ ఉంటాడు. ఇక డిసెంబర్ 20వ తేదీన శుక్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.

ధనుస్సు రాశిలో శుక్ర సంచారం
ధనుస్సు రాశిని బృహస్పతి పాలిస్తాడు. అందువల్ల బృహస్పతి రాశి అయిన ధనుస్సు రాశి యొక్క శుక్ర సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను, ఊహించని ఆర్థిక లాభాలను కలిగిస్తుంది. ఈ సమయంలో వీరికి శుభ ఫలితాలు వస్తాయి. ధనుస్సు రాశిలో శుక్ర సంచారంతో లబ్ధిని పొందే ఆ రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

venus into sagittarius on december 20th gives luck to these zodiac signs

కన్యారాశి
ధనుస్సు రాశిలో శుక్ర సంచారం కన్యారాశి జాతకులకు మంచి చేస్తుంది. శుక్రుడు కన్యారాశిలో నాలుగవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ప్రయోజనకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధం బలోపేతం అవుతుంది. అన్ని విధాలా బాగుంటుంది. అదృష్టం, సృజనాత్మకత విషయాలలో లబ్ధిని పొందుతారు. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేస్తారు. పూర్వీకుల నుండి సంపద వస్తుంది.

ధనుస్సు రాశి
ధనుస్సురాశిలో శుక్ర సంచారం ధనుస్సు రాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది. శుక్రుడు ధనుస్సురాశిలో శుభప్రదమైన ఫలితాలను ఇస్తాడు. ధనుస్సు రాశిలో శుక్రుడు లగ్న గృహంలో ప్రయాణం చేస్తాడు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అవివాహితులకు వివాహ యోగం ఉంది. భాగస్వామ్య పనిలో లాభాలు వస్తాయి.

తులారాశి
శుక్ర సంచారం తులా రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. శుక్రుడు తులా రాశిలో మూడవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల తులారాశి వారిలో ధైర్యం, శౌర్యం పెరుగుతాయి. ఈ సమయం తులా రాశి వారికి విజయాలను చేకూరుస్తుంది. శత్రువులు బలహీన పడతారు. మీ వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది. విదేశాలలో సంబంధాలు ఉన్నవారు గణనీయమైన లాభాలు పొందుతారు. తోడబుట్టిన వారి మద్దతు ఈ సమయంలో లభిస్తుంది.

disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+