త్వరలో వీరి జీవితాన్ని వ్యసనాలమయం, ఖర్చులపాలు చేయకుండా వదిలిపెట్టనన్న శుక్రుడు!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు విలాసాలకు, సిరిసంపదలకు, సుఖసంతోషాలకు కారకమైన గ్రహం. శుక్రుడు తన ఉచ్ఛరాశి అయిన మీనరాశిలోకి త్వరలో సంచారం చేయబోతున్నాడు. జనవరి 28వతేదీన శుక్రుడు మీనరాశిలోకి సంచరిస్తాడు. మీనరాశిలో శుక్ర సంచారం ఈనెల 28వ తేదీ నుంచి ఏప్రిల్ మొదటివారం వరకు జరుగుతుంది. దీనివల్ల కొన్ని రాశులవారికి శుభఫలితాలు వస్తుండగా కొన్ని రాశులవారు అశుభ ఫలితాలను ఎదుర్కోబోతున్నారు. ఇక కొన్ని రాశులవారు మిశ్రమ ఫలితాలను చూస్తారు.

మేషరాశి
మేష రాశి వారికి వ్యయస్థానంలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల విపరీతంగా ఖర్చులు పెట్టే అవకాశం ఉంది. విహారయాత్రలు వినోదయాత్రలు చేసినప్పటికీ అనవసరమైన ఖర్చులు, వ్యసనాలు వంటివి ఇబ్బంది పెడతాయి. పరిచయాలు, స్నేహ సంబంధాల అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటారు.

Venus said these zodiac signs will see huge money wastage and addictions soon

కర్కాటక రాశి
కర్కాటక రాశికి మీనరాశిలో శుక్ర సంచారం ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులకు కారణమవుతుంది. విదేశీయానం చేయాలని అవకాశాలు చేజారి పోతాయి. అక్రమ సంబంధాలకు, అనవసర పరిచయాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. తండ్రితో అకారణ విభేదాలు తలెత్తుతాయి. తొందరపాటు నిర్ణయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటారు.

సింహరాశి
శుక్రుడు ఉచ్ఛసంచారం సింహరాశిలో అష్టమ స్థానంలో జరగడం వల్ల ,కొంతమంది అనవసర పరిచయాలు, వ్యసనాలు పెరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతోను, జీవిత భాగస్వామితోనూ అకారణ విభేదాలు తలెత్తుతాయి. వైవాహిక జీవితంలో అసంతృప్తి ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తప్పవు.

తులారాశి
తులా రాశిలో శుక్రుడు ఆరవ స్థానంలో సంచరించడంతో కొన్ని మంచి ఫలితాలు కలిగినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు వస్తాయి. ఆదాయం పెరిగినా విలాసాల మీద బాగా ఖర్చు చేసి ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో కూడా అధికారుల నుంచి ప్రతికూలతలను ఎదుర్కొంటారు.

మీన రాశి
మీన రాశికి దుస్థానాధిపతి అయిన శుక్రుడు ఈ రాశిలో సంచారం చేయడం వల్ల మీనరాశి జాతకులు ఇబ్బంది పడతారు. ఆశించిన ప్రయోజనాలు కలగవు. శ్రమ అధికంగాను ఫలితం తక్కువగాను ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించవు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. వ్యసనాలతో ఇబ్బంది పడతారు. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+