త్వరలో వీరికి అఖండ ధనయోగాన్ని ప్రసాదిస్తున్న విలాసాల అధిపతి శుక్రుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో శుక్రుడిని లగ్జరీలకు అధిపతిగా భావిస్తారు. మార్చి ప్రారంభంలో శుక్రుడు మీనరాశిలో తిరోగమనం చెందుతున్నాడు. మీన రాశిలో శుక్రుడి తిరోగమనం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. శుక్రుడి తిరోగమనం కారణంగా లబ్ధి పొందుతున్న ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేషరాశి
శుక్రుడి తిరోగమనం కారణంగా మేషరాశి వారికి కలిసి వస్తుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో వారి కోరికలను తీర్చుకోగలుగుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను ఆర్థిస్తారు. ఆదాయం అద్భుతంగా పెరుగుతుంది. దీర్ఘకాలంగా ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి.

సింహరాశి
శుక్రుడి తిరోగమనం కారణంగా సింహరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో సింహరాశి జాతకుల ఇళ్లలో శుభకార్యాలను ప్లాన్ చేసుకోవచ్చు. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. ఆస్తిక సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. అయితే ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
కన్యా రాశి
శుక్రుడి తిరోగమనం కారణంగా కన్యా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది . కన్యా రాశి వారి జీవితంలో సంతోషం పెరుగుతుంది. కన్యా రాశి వారికి సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీరు స్నేహితుల సహాయంతో ప్రయోజనాలను పొందుతారు. కన్యారాశి జాతకుల ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఇది కన్యా రాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే సమయం.
మీనరాశి
శుక్రుడి తిరోగమనం కారణంగా మీనరాశి జాతకులకు కలిసి వస్తుంది. మీనరాశి జాతకులు ఈ సమయంలో గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు. మీన రాశి వారి బ్యాంకు బాలన్స్ పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో మీన రాశి వారికి ఖ్యాతి పెరుగుతుంది. ఇది మీనరాశి వారికి అనుకూల సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications