భరణి నక్షత్రంలో శుక్రసంచారం.. మే నెలలో ఈ రాశులవారికి గృహ, వాహనయోగం.. మీరున్నారా?
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశికి, ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి మార్పులు జరుగుతూ ఉంటాయి. రాశులలో అతి ముఖ్యమైన గ్రహంగా శుభకరమైన గ్రహంగా భావించే శుక్రుడు నక్షత్రాన్ని మార్చుకున్నాడు. శుక్రుడు భరణి నక్షత్రం లోకి ప్రవేశించాడు. శుక్రుడు భరణి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది.
మేషరాశి
మేషరాశి వారికి శుక్రుడు భరణి నక్షత్రంలోకి ప్రవేశించడం ఆర్థిక లాభాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మేషరాశి జాతకులకు ఈ నెల అంతా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. వీరి కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి.

మిధునరాశి
శుక్రుడు భరణి నక్షత్రంలోకి ప్రవేశించడంతో మిధునరాశి జాతకుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో వీరు కొత్త ఇంటిని కానీ, వాహనాన్ని కానీ కొనుగోలు చేస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం మిధునరాశి వారికి పుష్కలంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఈ సమయంలో ఏ పని చేపట్టిన మంచి ఫలితం వస్తుంది కానీ ఆలోచించి చేయడం ముఖ్యం. ఆర్థికంగా ఈ సమయం సంతృప్తికరంగా ఉంటుంది.
సింహరాశి
శుక్రుడు భరణి నక్షత్రంలోకి ప్రవేశించడంతో సింహరాశి జాతకుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది చాలా శుభకరమైన సమయం. ఈ సమయంలో కొత్త ఇంటిని, ఆస్తిని లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయాలనుకున్నా ఇదే అనుకూల సమయం.
కన్యారాశి
శుక్రుడి నక్షత్రం మార్పు కన్యా రాశి వారికి లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగిస్తుంది. కొత్త వాహనాలను కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో ఏ వ్యాపారం చేసిన ఆర్థిక లాభాలు వస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఇది మంచి సమయం. అయితే ఈ సమయంలో ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications