సింహరాశిలోకి శుక్ర గోచారం.. త్వరలో వీరికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుంది!!

త్వరలో సింహరాశిలో శుక్ర సంచారం జరగబోతోంది. శుక్రుడు జులై 31వ తేదీన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సింహరాశిలోకి శుక్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు రాగా మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. శుక్రుడు ప్రేమ, సృజనాత్మకత, విలాసాలను ఇచ్చే గ్రహం. సింహరాశిలో శుక్ర సంచారం ముఖ్యంగా నాలుగు రాశుల వారికి శుభాలను చేకూరుస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
సింహరాశిలో శుక్ర సంచారం వృషభ రాశి వారికి లబ్ధిని చేకూరుస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారికి వాహనాలను, గృహాలను కొనుగోలు చేసే యోగం ఉంది. వృషభ రాశి విద్యార్థులకు ఇది శుభ సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం కలిసొస్తుంది. బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల విక్రయాలు ఈ సమయంలో కలిసి వస్తాయి. ఉద్యోగం పురోగమిస్తుంది. వర్తక వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

Venus transit in Leo these zodica signs will get good fortune and wealth

మిధున రాశి
సింహరాశిలో శుక్ర సంచారంతో మిధున రాశి జాతకులకు కలిసొస్తుంది. మిధున రాశి వారు ఈ సమయంలో ఆర్థికంగా లబ్ధిని పొందుతారు. కెరీర్ బాగుంటుంది. విదేశీ అవకాశాలు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఈ సమయం మీ జీవితాల్లో సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తుంది.

కన్యారాశి
సింహరాశిలో శుక్ర సంచారం కన్యారాశి జాతకులకు అపారమైన లాభాలను ఇస్తుంది. కన్యా రాశి వారు ఈ సమయంలో నూతన ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు ఉన్నతాధికారుల నుండి గుర్తింపు పొందుతారు. ప్రమోషన్లకు, ఇంక్రిమెంట్లకు ఈ సమయంలో అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి గణనీయమైన లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారాలను విస్తరించడానికి కూడా ఇదే సరైన సమయం.

తులారాశి
సింహరాశిలో శుక్ర సంచారం తులా రాశి జాతకులకు లబ్ధిని చేకూరుస్తుంది. తులా రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా లాభాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి విజయాలు వరిస్తాయి. కొత్త వెంచర్లను ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. కెరీర్ లోను కొత్త మార్పు కనిపిస్తుంది. ఈ సమయంలో ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+