జులై నెలలో శుక్ర సంచారం.. ఈ రాశులవారు విలాసాల్లో మునిగితేలుతారు!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావం చూపిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే జులై నెలలో శుక్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి లబ్ధి జరుగుతుంది. జులైలో శుక్ర సంచారం ఏ విధంగా ఉండబోతుంది? ఏ ఏ రాశుల వారు లబ్ధిని పొందుతారు? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
జులై నెలలో శుక్ర సంచారం
జులై 7 2024న శుక్రుడు చంద్రుని రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జూలై 11న శుక్రుడు కర్కాటక రాశిలో ఉదయిస్తాడు. ఆపై జూలై 31వ తేదీన శుక్రుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి వెళ్తాడు. ఈ విధంగా శుక్రుడు జులై నెలలో రెండు రాశులలో సంచరిస్తున్నాడు. ఇది అన్ని రాశుల వారిపైన ప్రభావం చూపుతుండగా ముఖ్యంగా కొన్ని రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని తీసుకువస్తుంది.

కర్కాటక రాశి
జులై నెలలో శుక్ర గ్రహ సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి లబ్ధి జరుగుతుంది. శుక్రుడు కర్కాటక రాశి వారి లగ్న గృహాల్లో మాత్రమే సంచరిస్తాడు. ఈ కాలంలో కర్కాటక రాశి వారి జీవితంలో అపారమైన విజయాలు వస్తాయి. కెరీర్ పురోగమిస్తుంది. డబ్బులు ఆదా చేయగలుగుతారు. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి.
మేషరాశి
మేషరాశిలో నాలుగవ, ఐదవ ఇంట్లో శుక్ర సంచారం జరుగుతుంది. దీనివల్ల వీరు లగ్జరీ లైఫ్ ను ఈ సమయంలో లీడ్ చేస్తారు. వస్తు, వాహన, ఆస్తియోగాలు ఈ సమయంలో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి లాభాలు వస్తాయి. ఆర్థికంగా ఈ సమయం మేష రాశి వారిని బలోపేతం చేస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయంలో ఏ పని చేసినా సక్సెస్ అవుతారు.
తులారాశి
తులారాశిలో శుక్రుడు పదవ ఇంట్లో, ఆదాయ గృహంలో సంచరిస్తాడు. తులారాశి జాతకులకు శుక్ర సంచారం కారణంగా వర్తక వ్యాపారాలలో లాభం వస్తుంది. స్థిరాస్తులలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలిక లాభాలు వచ్చే పనులు ఈ సమయంలో చేస్తారు. ఉద్యోగస్తులు తమ శ్రమతో సరైన ఫలితాలను పొందడానికి ప్రయత్నిస్తారు. మీరు ఉద్యోగం చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. వ్యాపారవేత్తలు తమ కార్యకలాపాలను విస్తరించుకోవడానికి ఇది సరైన సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications