ధన త్రయోదశికి ముందే వీరిపై కనకవర్షం కురిపించనున్న శుక్రుడు!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట వ్యవధిలో రాశిని మార్చుకుంటూ ఉంటుంది. అయితే రాశులు మాత్రమే కాదు గ్రహాలు నక్షత్రాల సంచారం కూడా చేస్తూ ఉంటాయి.రాశి సంచారమైనా, నక్షత్ర సంచారమైన సరే ద్వాదశ రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రాశుల వారికి ఈ సంచారం శుభ ఫలితాలను ఇస్తుండగా మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది.

జ్యేష్ఠ నక్షత్రంలోకి శుక్రుడు
త్వరలోనే లగ్జరీలకు కారణమైన శుక్ర గ్రహం తన రాశిని మార్చుకుంటుంది. రాశి పరివర్తన కంటే ముందే శుక్రుడు నక్షత్ర పరివర్తన జరుగుతుంది. ధన త్రయోదశికి ముందు శుక్రుడు జ్యేష్ఠ నక్షత్రం లోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 27వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట 15 నిమిషాలకు శుక్రుడు జ్యేష్ఠ నక్షత్రంలోకి సంచారం చేస్తాడు.

Venus transit into jyeshta nakshatra gives wealth and luxuries to these zodiac signs before dhanteras

మూడు రాశులకు శుభం
ఇక అప్పటి నుంచి నవంబర్ 7వ తేదీ వరకు శుక్రుడు జ్యేష్ఠ నక్షత్రంలోనే ఉంటాడు. ఈ నక్షత్ర పరివర్తన ముఖ్యంగా మూడు రాశుల వారికి శుభాలను చేకూరుస్తుంది. శుక్రుడి నక్షత్ర మార్పు కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

సింహరాశి
శుక్రుడి నక్షత్ర సంచారం సింహ రాశి వారికి శుభప్రదం కానుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో కెరీర్ లో మంచి పురోగతిని చూస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి జరుగుతుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు జీవితంలో మంచి ఎదుగుదలను చూస్తారు. ఉద్యోగాలు చేసే వారికి ఇంక్రిమెంట్లు వస్తాయి.

కన్యారాశి
ధన త్రయోదశి కంటే ముందే శుక్రుని నక్షత్ర పరివర్తన కన్య రాశి జాతకులకు శుభాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో కన్యా రాశి జాతకుల నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ధన లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. పని చేసే చోట సహచరుల మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏ పని చేసిన విజయాలను సాధిస్తారు.

మకర రాశి
ధన త్రయోదశి కంటే ముందే శుక్రుని నక్షత్ర పరివర్తన మకర రాశి జాతకులకు మంచి విజయాలను చేకూరుస్తుంది. మకర రాశి జాతకులు ఈ సమయంలో శుభవార్తలు వింటారు. వర్తక వ్యాపారాలు చేసేవారు ఊహించని మంచి డీల్స్ పొందుతారు. కష్టపడి పనిచేసే వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఈ సమయంలో మకర రాశి వారు అన్ని రంగాలలో విజయాలు సాధిస్తారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి శుభవార్తలు అందుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+