Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కార్తీకమాసం ముగిసేదాకా ఈ రాశులకు మహారాజయోగం.. శుక్రుడి శాసనం!

వేద జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు అత్యంత ముఖ్యమైన గ్రహాలలో ఒకటి. శుక్రుడు జాతకంలో శుభ స్థానంలో ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ప్రేమ, అందం, సంపద, కీర్తి మరియు భౌతిక ఆనందాల గ్రహంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, శుక్ర సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇక ప్రస్తుతం శుక్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు.

పూర్వాషాఢ నక్షత్రంలోకి శుక్రుడు
నవంబర్ 18వ తేదీ నాడు శుక్రుడు మూలా నక్షత్రం నుండి రాత్రి 8:08 గంటలకు బయలుదేరి పూర్వాషాఢ నక్షత్రంలోకి ప్రవేశించాడు. పూర్వాషాఢ నక్షత్రం శుభ మరియు ఫలవంతమైన నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. కాబట్టి ఈ నక్షత్రంలో శుక్రుడు సంచరించడం వలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది. కొన్ని రాశుల వారు విశేషమైన ప్రయోజనాలను పొందుతున్నారు. అయితే ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

venus transit into purvashada nakshatra gives maharaja life for these zodiac signs in karthika masam

వృషభ రాశి
పూర్వాషాఢ నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఆర్ధికంగా ప్రయోజనకరంగా ఉంటుంది, నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. అవివాహితులకు వివాహ అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు అవుతాయి. మీరు రుణ బాధల నుండి విముక్తి పొందుతారు. మీరు నిర్వహించగలిగే దానికంటే ఎక్కువ డబ్బు మీ వద్ద ఉంటుంది.

తులారాశి
పూర్వాషాఢ నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా తులారాశివారు శుభ ఫలితాలను పొందుతారు. ఈ సంచారం తులారాశి వారి కుటుంబ జీవితం , వైవాహిక జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయం. పని చేసే కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. సహోద్యోగులతో సానుకూలంగా ఉంటారు. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. కొత్త వాణిజ్య ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.

మీనరాశి
పూర్వాషాఢ నక్షత్రంలో శుక్రుని సంచారం మీనరాశిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. మీనరాశి వారు ఈ సమయంలో ఏ పని చేసినా విజయం సాధిస్తారు. కుటుంబ బంధాలు బలపడతాయి. ప్రేమించిన వారిని వివాహం చేసుకునే అవకాశం ఉంది, జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ లు వస్తాయి. ఆర్ధికంగా ఇప్పుడు మెరుగైన పరిస్థితి ఉంటుంది. వర్తక వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఇది మీనరాశి వారికి మంచి అదృష్టాన్ని ఇచ్చే పీరియడ్.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+