జులై 26నుండి ఈ రాశులవారు పులిపంజా చీల్చి సంపన్నులవుతారన్న శుక్రుడు!
జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గ్రహాలలో కీలక గ్రహంగా భావించే శుక్రుడు సంపదలకు, విలాసాలకు, అందానికి, సౌఖ్యానికి అధిపతి. అటువంటి శుక్రుడు మరికొద్ది రోజుల్లో మిధున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. శుక్రుడు మిధున రాశి వారికి సంచారం చేయడం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది.
మిధునరాశిలో శుక్ర సంచారం
విలాసాల అధిపతి అయిన శుక్రుడు జులై 26వ తేదీన మిధున రాశిలోకి వెళ్తాడు. ఆగస్టు 20వ తేదీ వరకు మిధున రాశి లోనే సంచారం చేస్తాడు. ఇక శుక్ర సంచారం వల్ల అదృష్టవంతులు అయ్యే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
శుక్రసంచారం కారణంగా మేషరాశి జాతకులు అదృష్ట జాతకులు గా మారుతున్నారు. మేషరాశి వారికి ఈ సమయంలో ఏ పని చేసిన కలిసి వస్తుంది. శుక్రుడు మేషరాశిలో రెండవ, ఏడవ ఇంటికి అధిపతి. శుక్ర సంచారం మేషరాశిలో మూడవ ఇంట్లో జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. శుక్రుడు ఈ సమయంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ప్రత్యర్థులపైచేయి సాధించేలాగా చేస్తాడు. కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది.
సింహరాశి
శుక్ర సంచారం సింహ రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. శుక్రుడు సింహరాశిలో మూడవ, పదవ ఇంటికి అధిపతి. శుక్ర సంచారం సింహ రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుండి స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.
తులారాశి
శుక్ర సంచారం తులా రాశి జాతకులను అదృష్ట జాతకులుగా మారుస్తుంది. శుక్రుడు తులా రాశిలో ఎనిమిదవ ఇంటికి అధిపతిగా ఉంటాడు. ఈ సమయంలో తులా రాశి వారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పిల్లల నుండి శుభవార్తలు వింటారు.
వృశ్చిక రాశి
శుక్రుడు వృశ్చిక రాశిలో ఏడవ, 12వ ఇంటికి అధిపతి. శుక్రుడు వృశ్చిక రాశిలో ఎనిమిదవ ఇంట్లో సంచారం చేయడం వల్ల వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. ఎంతోకాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ జీవితం మునుపటి కంటే బాగుంటుంది.
కుంభరాశి
శుక్రుడు కుంభరాశిలో నాలుగవ ఇంటికి అధిపతి. శుక్రుడు కుంభరాశిలో ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల శుక్ర సంచారం కుంభ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది . విద్యార్థులు సానుకూల ఫలితాలను పొందుతారు. కళలు, సాహిత్య రంగాలకు సంబంధించిన వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కష్టాల నుంచి బయటపడగలుగుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications