వీరికి సంపదల ఖజానా పంపకం మొదలెడుతున్న విలాసాధిపతి!

గ్రహాలు 9. ఈ నవ గ్రహాలు ద్వాదశ రాశుల వారి జీవితాలను శాసిస్తాయి. నవగ్రహాలలో అత్యంత ముఖ్యమైన గ్రహంగా శుక్రుడికి ఒక స్థానం ఉంది. శుక్రుడిని విలాసాలకు లగ్జరీ లకు ప్రేమకు , వైవాహిక ఆనందానికి, కళలకు, ప్రతిభకు, అందానికి, కారకుడిగా చెబుతారు. శుక్రుడు వృషభ రాశికి, తులా రాశికి అధిపతి. మీన రాశి శుక్రుడికి ఉన్నత రాశి. కన్యారాశి శుక్రుడికి నీచరాశి .

మృగశిర నక్షత్రంలో శుక్ర సంచారం
అటువంటి శుక్రుడు శుభప్రదంగా ఉన్నప్పుడు ఆయా రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. శుక్రుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను కూడా చూడాల్సి వస్తుంది. ఇక శుక్రుడు మృగశిర నక్షత్రం 5వ పాదంలో ప్రవేశిస్తున్నాడు. దీంతో జూన్ 20వ తేదీ నుంచి మృగశిర నక్షత్రం లోకి శుక్ర సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

venus will give wealth to these zodiac signs with mrigashira nakshatra transit

మిధున రాశి
మృగశిర నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా మిధున రాశి జాతకులకు కలిసి వస్తుంది. వీరికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసిన అదృష్టం వరిస్తుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మృగశిర నక్షత్రంలో శుక్ర సంచారం మిధున రాశి వారి పురోగతికి కారణమవుతుంది.

సింహరాశి
మృగశిర నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా సింహరాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. సింహ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వర్తక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు వస్తాయి. సింహ రాశి వారు కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితంలో శుభపరిణామాలు చూస్తారు. సింహ రాశి వారు ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు. కొత్త పనులను బాధ్యత తీసుకోవడంతోపాటు వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు.

కన్యారాశి
కన్యారాశి జాతకులకు మృగశిర నక్షత్రంలో శుక్ర సంచారం పురోగతికి కారణంగా మారుతుంది. కన్యా రాశి వారు ఎప్పటినుంచో ఆగిపోయిన పనులను ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. కన్యారాశి వారి ప్రతిష్ట పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. ధన ప్రవాహానికి కన్యా రాశి వారికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. సంపద పెరగడానికి మార్గం సుగమం అవుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి ఫలితాలు వస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+