రాసిపెట్టుకోండి.. నాలుగు రోజుల్లో వీరిపై సంపదల వర్షం కురిపించనున్న శుక్రుడు!
సూర్యుని నుండి రెండవ గ్రహమైన శుక్ర గ్రహానికి సౌర వ్యవస్థలో చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి శుక్ర గ్రహం మనకు దగ్గరగా ఉండేటువంటి గ్రహం సూర్యుని చుట్టూ తిరిగే అత్యంత ప్రకాశవంతమైన గ్రహం. శుక్ర గ్రహం జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని సంపదకు ప్రేమకు, అందానికి, కళలకు, భౌతిక సుఖాలకు ప్రతీక.
వృషభరాశిలో శుక్రసంచారం
అటువంటి శుక్రుడు జూన్ 29వ తేదీన ఆదివారం రోజు మధ్యాహ్నం 2 గంటల 17 నిమిషాలకు వృషభ రాశిలోకి సంచారం చేస్తున్నాడు. వృషభ రాశిలో శుక్ర సంచారం మాలవ్య మహాపురుష రాజయోగానికి కారణమవుతుంది. కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. శుక్ర సంచారంతో ఏర్పడే మాలవ్య మహా పురుష రాజయోగం తో లబ్ధి పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

సింహరాశి
మాలవ్య మహాపురుష రాజయోగం సింహరాశి జాతకులను అదృష్ట జాతకులుగా మారుస్తుంది. జూన్ 29వ తేదీ నుంచి సింహరాశి జాతకులు చేసే ప్రతి పనిలోనూ విజయాలను సాధిస్తారు. సింహరాశి వారికి మరో నాలుగురోజుల్లో మంచిరోజులు ప్రారంభం కానున్నాయి. అప్పటి పనిచేసే సింహరాశి వారు మంచి ప్రయోజనాలను పొందుతారు. పోటీపరీక్షల కోసం కష్టపడే విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాలను సాధిస్తారు. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి.
మిధున రాశి
మాలవ్య మహాపురుష రాజయోగం మిధున రాశి జాతకులకు శుభ యోగాలను చేకూరుస్తుంది. జూన్ 29వ తేదీ నుంచి మిధున రాశి జాతకులు మాలవ్య మహాపురుష రాజయోగంతో లబ్ధిని పొందుతున్నారు. ఈ సమయంలో ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అనుకూల ప్రయోజనాలు వస్తాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వారికి ఇది మంచి సమయం. జీవిత భాగస్వామి నుంచి మిధున రాశి వారికి మద్దతు లభిస్తుంది.
ధనుస్సు రాశి
మాలవ్య మహాపురుష రాజయోగం ధనుస్సు రాశి జాతకులను అదృష్ట జాతకులుగా మారుస్తుంది .ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా విజయలక్ష్మి వరిస్తుంది. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. చేసే ప్రతి పనిలోనూ ధనుస్సు రాశి వారు విజయాలను సాధిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications