త్వరలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి మొదలవుతుంది గోల్డెన్ టైమ్!!

సహజంగా గ్రహాల మార్పు అన్ని రాశి చక్ర జాతకుల జీవితాలపైన గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహాలలో అత్యంత ముఖ్యమైన శుక్ర గ్రహ సంచారం కూడా వివిధ రాశుల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. శుక్ర గ్రహ సంచారం కొన్ని రాశులకు గోల్డెన్ డేస్ ను తీసుకువస్తుంది. ఈ సంవత్సరం ఈ నెలలో శుక్ర గ్రహ సంచారం జరగనుంది.

నవంబర్ 30 తేదీన శుక్రుడు తన ఉన్నతమైన రాశి అయిన తులా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ మార్పు కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నవంబర్ 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటల ఐదు నిమిషాలకు శుక్ర సంచారం జరుగుతుంది. శుక్రుడు తన దిగువ రాశి అయిన కన్యారాశి నుండి బయటకు వెళ్లి ఉన్నత రాశి అయిన తులారాశిలో ప్రవేశిస్తాడు.

Venus will transit soon.. Golden time will start for these zodiac signs

ఇక శుక్ర సంచారం వల్ల మేషరాశి తో సహా అనేక రాశుల వారు ఆర్థిక లాభాన్ని, వృత్తిలో పురోగతిని పొందుతారు. అనేక శుభ వార్తలను వింటారు. శుక్ర గ్రహం రాశి మార్పు వల్ల ముఖ్యంగా మేష రాశి జాతకులకు కలిసొస్తుంది. మేష రాశి వారి జీవితంలో శుక్రుడు సంతోషాన్ని కలిగిస్తాడు.

శుక్ర సంచారం తో మేష రాశి వారికి వ్యాపారం విస్తరణ సాధ్యమవుతుంది. ఈ కాలంలో ప్రేమ జీవితం మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. వివాహం కానివారు వివాహం చేసుకోవడానికి అనుకూలమైన సమయం. ఈ సమయంలో జీవిత భాగస్వామి నుండి సంపూర్ణ మద్దతును పొందుతారు. సౌకర్యాలు మెరుగవుతాయి.

ఇక శుక్ర గ్రహ సంచారం వల్ల కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వారికి ఆర్థిక లాభాలు వచ్చి పడతాయి కుటుంబ జీవితం బాగుంటుంది. భూములు, వస్తువులు, వాహనాలు, ఆస్తులు కొనుగోలు ఈ సమయంలో సాధ్యమవుతుంది. వ్యాపారం చేసే వారు మంచి లాభాలను పొందటానికి ఇది సరైన సమయం. పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని కూడా గడుపుతారు.

శుక్ర గ్రహ సంచారం వల్ల కన్యా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. శుక్ర దేవుడి అనుగ్రహంతో ఈ సమయంలో ఏ పని చేసినా మీకు విజయలక్ష్మి వరిస్తుంది. మీ ప్రసంగంతో అందరిని ఆకర్షిస్తారు మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగాలలో మాత్రమే కాదు వృత్తిలో మంచి అవకాశాలు లభిస్తాయి. శుక్రుడి మార్పుతో మీ ప్రేమ జీవితం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+