నాలుగు అద్భుతమైన యోగాలతో వినాయకుడు ప్రకటించాడు లక్ష్మీకటాక్షం!

2024 సంవత్సరంలో వినాయక చవితి పండుగ రానే వస్తుంది. సెప్టెంబర్ 7వ తేదీన హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే వినాయక చవితి పండుగను జరుపుకోబోతున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలందరూ వాడవాడలా గణపతి విగ్రహాలను తీసుకువచ్చి ప్రతిష్టించి పూజలు చేస్తారు. గణేశ నవరాత్రులను తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అయితే గణేష్ చతుర్థి రోజు అదృష్టాన్ని మార్చే ఒక గొప్ప యోగం ఏర్పడుతుంది.

వినాయక చవితి నాడు భద్రవాస యోగం
ఈ యోగంలో ఎవరైతే వినాయకుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వారికి అఖండ ధనయోగం కలుగుతుంది. వినాయక చవితి పండుగ రోజు వినాయక చవితి పూజ సమయంలో భద్రవాసయోగం ఏర్పడుతుంది. వినాయక చవితి పండుగ హిందూ మతంలో భాద్రపద శుక్లపక్ష చతుర్థినాడు జరుపుకుంటాము. ఈసారి వినాయక చవితి పండుగ రోజు ఉదయం నాలుగు గంటల 20నిమిషాలకు భద్రవాస్ యోగం ఏర్పడుతుంది. ఇది సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ముగుస్తుంది.

Vinayaka Chavithi 2024 Four amazing yogas gives wealth those who worships lord ganesha

భద్రవాస యోగంతో పాటు మరో మూడు యోగాలు
భద్ర పాతాళంలో ఉండే సమయాన్ని భద్రవాస యోగం అంటారు. భద్రుడు పాతాళంలో ఉన్నాడు కారణంగా భూలోకంలో నివసించే వాళ్లకు మంచి జరుగుతుందని, సుఖసంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక అంతే కాదు ఈసారి వినాయక చవితి పండుగ రోజు బ్రహ్మ యోగం, ఇంద్రయోగం కూడా ఏర్పడుతున్నాయి. ఈరోజునే ఏర్పడే సిద్ధయోగం కూడా చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది.

వారికి సిరిసంపదలను ఇచ్చే వినాయకుడు
అంతేకాదు ఈ సంవత్సరం చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రాలు కూడా ఈ రోజునే కనిపిస్తాయి .స్వాతి నక్షత్రం చదువుల తల్లి సరస్వతి దేవికి, చిత్తా నక్షత్రం శక్తికి చిహ్నంగా చెప్పబడుతుంది. అటువంటి ఈ నక్షత్రాలు కనిపించటం కూడా వినాయక చవితినాడు జరుగుతుంది. ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఈ యోగాల సమయంలో గణేషుని పూజిస్తారో వారిని గణేషుడు సకల సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో ఆశీర్వదిస్తారని చెబుతారు.

వినాయకుడిని పూజిస్తే కష్టాలకు, బాధలకు చెక్
ఆదిపూజలు అందుకునే గణనాధుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించటం వలన జీవితంలోని అన్ని రకాల కష్టాలు, బాధలు తొలగిపోతాయని చెప్తారు. గణేష్ చతుర్థి నాడు ప్రత్యేక యోగాల సమయంలో వినాయకుడిని పూజిస్తే ఆదాయం మరియు సౌభాగ్యం పెరుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+