వినాయక చవితి 2025: రాశుల ఆధారంగా గణేశుడికి ఇవి సమర్పిస్తే సిరిసంపదలు
హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసం శుక్లపక్షంలో చతుర్థి నాడు వినాయక చవితి పండుగను జరుపుకుంటాం. ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ ఆగస్టు 27వ తేదీన బుధవారం నాడు వచ్చింది. ఆ రోజు నుంచి తొమ్మిది రోజులపాటు వినాయక నవరాత్రులను ఘనంగా జరుపుకుంటాం. ఇక వినాయక చవితి నాడు వినాయకుడి అనుగ్రహం కలగాలంటే రాశుల ప్రకారం ఏ విధంగా పూజిస్తే మంచిది అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.
మేష, వృషభ రాశులవారు గణేశుని కటాక్షం కోసం ఇలా చెయ్యాలి
మేష రాశి వారు వినాయకుడికి లడ్డూలను సమర్పించి నిష్ఠతో పూజ చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. వినాయకుడి కటాక్షంతో వీరి జీవితం సంతోషంగా సాగుతుంది.
వృషభ రాశి వారు వినాయక చవితి నాడు వినాయకుడికి మోదకాలను సమర్పించి పూజిస్తే విశేష ఫలితాలను పొందుతారు. వీరి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు ఇబ్బందులు తొలగిపోయి సుఖంగా జీవిస్తారు.

మిధున, కర్కాటక రాశుల వారు ఇలా పూజించాలి
మిధున రాశి వారు వినాయక చవితి నాడు వినాయకుడికి మోదకాలను సమర్పిస్తే శుభ ఫలితాలను పొందుతారు .వీరి జీవితం వినాయక చవితి నుండి గణేషుడి కటాక్షంతో సంతోషంగా సాగుతుంది. కర్కాటక రాశి వారు వినాయక చవితి నాడు వినాయకుడికి మోతిచూర్ లడ్డూలను సమర్పిస్తే వినాయకుడి కటాక్షం కలుగుతుంది.
సింహ, కన్యా రాశులవారు ఇలా చేస్తే మంచిది
సింహ రాశి వారు పసుపు రంగులో ఉండే బూందీ లడ్డూలను వినాయకుడికి సమర్పిస్తే గణేషుడి కటాక్షం కలుగుతుంది. కన్యా రాశి వారు నారింజ రంగులో ఉండే లడ్డూలను వినాయకుడికి సమర్పిస్తే, విఘ్నాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. గణేశుడు వీరిని చల్లగా చూస్తాడు.
తులా, వృశ్చిక రాశుల వారు గణేశుని పూజించాలిలా
తులారాశి వారు వినాయక చవితి నాడు గణపతికి మోదకాలను సమర్పిస్తే శుభ ఫలితాలను పొందుతారు. వీరి కష్టాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి వారు వినాయకుడికి మోతీచూర్ లడ్డూలను సమర్పిస్తే మంచిది. దీంతో వీరికి గణేషుడి కటాక్షం తప్పక కలుగుతుంది.
ధనుస్సు, మకర రాశుల వారు ఇలా పూజిస్తే మంచిది
ధనుస్సు రాశి వారు కుంకుమ పువ్వుతో చేసిన కీడును వినాయకుడికి సమర్పిస్తే కటాక్షం కలుగుతుంది. ధనుస్సు రాశి వారికి వినాయకుడి కటాక్షంతో మేలు జరుగుతుంది. మకర రాశి వారు వినాయకుడికి అపరాజిత పువ్వులను సమర్పిస్తే మంచి ఫలితాలను పొందుతారు. వినాయకుడు వీరికి వరాలను ఇస్తాడు.
కుంభ, మీన రాశులవారు వినాయకుడిని ఇలా పూజిస్తే మంచిది
కుంభ రాశి వారు వినాయకుడికి బూందీ లడ్డూలను సమర్పిస్తే శుభ ఫలితాలను పొందుతారు. మీన రాశి వారు పసుపు రంగులో ఉండే స్వీట్లను వినాయక చవితి నాడు వినాయకుడికి సమర్పిస్తే వినాయకుడి కటాక్షం కలుగుతుంది. కనుక రాశులవారీగా గణేశుని పూజించి, ఆయనకు ఇష్టమైనవి సమర్పించి శుభ ఫలితాలు పొందండి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications