త్వరలో విప్రీత్ రాజయోగం: ఈ రాశుల వారి జీవితం బంగారుమయం!!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీ నాటికి కుజుడు కన్యారాశిలో నివసిస్తాడు. ఆ సమయంలో కుజుడు అసాధారణమైన ఒక రాజయోగాన్ని సృష్టిస్తాడు. దీనినే విప్రీత్ రాజయోగం అని అంటారు. కుజుడు కన్యారాశిలో ప్రయాణించడం అన్ని రాశి చక్ర జాతకుల జీవితాల పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
అయితే ముఖ్యంగా మూడు రాశుల వారి జాతకాలలో మాత్రం విప్రీత్ రాజయోగం వల్ల వారి అదృష్టం ప్రకాశిస్తుంది. ఆ అదృష్ట రాశి జాతకులు ఎవరో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. విప్రీత్ రాజయోగం ఏర్పడడం వల్ల మేష రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. మేష రాశి జాతకులు ఈ సమయంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఈ సమయంలో వారు అన్ని పనులలోను విజయం సాధిస్తారు.

కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మేషరాశి వారికి ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో ఆర్థిక లాభాలను చూస్తారు. భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ఇదే సరైన సమయం. వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పెట్టిన పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. విప్రీత్ రాజయోగం వల్ల వారు శత్రువులపై విజయం సాధిస్తారు.
విప్రీత్ రాజయోగం ఏర్పడడం వల్ల కర్కాటక రాశి జాతకులకు బాగా కలిసొస్తుంది. కర్కాటక రాశి జాతకులు అనుకున్న పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం. వీరిలో ఆత్మ విశ్వాసం మరింత పెరుగుతుంది. మీరు ఏ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా లాభాలు అర్ధించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త కెరీర్ అవకాశాలు కనిపిస్తాయి.
వి ప్రీత్ రాజయోగం వల్ల తులా రాశి వారు ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. తుల రాశి వారి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి. వర్తక వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. తులా రాశి వారి ప్రతిష్ట మరియు గౌరవం పెరుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications