Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శని, చంద్రులచే ఏర్పడిన విష్ యోగా.. 4 రాశులవారికి నరకమే!!

చంద్రుడు సింహరాశిలోకి మారిపోతున్నాడు. ఈ సమయంలో చంద్రుడికి ఎదురుగా శని రావడం వల్ల విష్ యోగం ఏర్పడుతుంది. ఈ విష్ యోగం సెప్టెంబర్ 12న ఏర్పడుతుంది. విష్ యోగం వల్ల వివిధ రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. శని, చంద్ర గ్రహాల కలయిక వల్ల నిరాశ, ఆర్థిక సమస్యలు, అనేక ప్రతికూలతలు ఇబ్బంది పెడతాయి.

ఈ విష్ యోగ ప్రభావం ఏ ఏ రాశుల పైన ఉంటుంది? ఏ రాశుల వారు జాగ్రత్త వహించాలి? ప్రస్తుతం మనం తెలుసుకుందాం.వృషభ రాశి వారు విష్ యోగ ప్రభావంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీరి వృత్తిపరమైన జీవితంలో అసంతృప్తి చోటు చేసుకుంటుంది. ఉద్యోగులతో సమస్యలను ఎదుర్కొంటారు. తక్కువ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు ఈ సమయంలో ఊహించని నష్టాలు సంభవిస్తాయి. పనిచేసేచోట ప్రమోషన్లు రాకపోగా, ఊహించనివిధంగా చెడ్డపేరు వస్తుంది.

Vish Yoga formed by Saturn and Moon.. Severe problems for 4 zodiac signs!!

విష్ యోగ ప్రభావంతో కర్కాటక రాశి వారికి ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. ఈ సమయంలో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. కర్కాటక రాశి జాతకులు గాయాలపాలయ్యే అవకాశం ఉంది. విష్ యోగ ప్రభావంతో ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. చట్టపరమైన సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. నిరంతరం భవిష్యత్తు గురించి చింత ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి కలుగుతుంది. వైవాహిక జీవితంలోనూ ఒత్తిడి ఎదురవుతుంది.

సింహ రాశి వారు కూడా విష్ యోగ ప్రభావంతో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపారంలో సమస్యలను ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలోనూ సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార భాగస్వాములతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు పెరిగిపోయి, ఆందోళన స్థాయిలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితం కూడా నిరాశ జనకంగా ఉంటుంది.

కుంభ రాశి వారికి విష్ యోగ ప్రభావంతో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. మీరు తీవ్ర మానసిక అనారోగ్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. చేయాలనుకున్న పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఏదైనా పనిని పూర్తి చేయడంలో ఆలస్యం, అడ్డంకులు ఏర్పడి అవి నిరాశ నిస్పృహలకు కారణమవుతాయి. వైవాహిక జీవితం సైతం ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. వివాదాలు, వాదనలు జీవితంలో ఒక భాగంగా మారతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+