రెండు రోజుల్లో విషయోగం... ఈ రాశులవారికి దరిద్రం... జాగ్రత్త!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట కాలం తర్వాత తమ రాశి చక్రాలను మార్చుకుంటూ ఉంటాయి. గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం కొన్ని శుభయోగాలను, కొన్ని అశుభయోగాలను ఏర్పరుస్తాయి. గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే అశుభయోగాలలో విషయోగం ఒకటి. ఈ నెలలో శని చంద్రుల కలయిక కారణంగా విషయోగం ఏర్పడుతుంది.
కుంభరాశిలో విష యోగం
ఫిబ్రవరి 27వ తేదీన చంద్రుడు కుంభ రాశిలోకి ప్రవేశించిన సమయంలో అప్పటికే కుంభ రాశిలో శని ఉండడంతో విషయోగం ఏర్పడుతుంది. ఈ విషయం కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది . దీంతో కొన్ని రాశుల వారు కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.

కర్కాటక రాశి
కర్కాటకరాశి వారికి విషయోగం కష్టాలను తెస్తుంది. ఈ రాశిలోని ఎనిమిదవ ఇంట్లో శనీ చంద్రుల కలయిక జరగడం వల్ల కర్కాటకరాశి వారు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది వీరికి మంచి సమయం కాదు. ఈ సమయంలో కర్కాటక రాశి వారు గొడవలకు దూరంగా ఉండాలి. కర్కాటక రాశి వారిపై ఏలినాటి శని ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి.
కన్యారాశి
కన్య రాశిలో జన్మించిన వారికి విషయోగం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ అశుభయోగం కన్యా రాశి వారి ఆరవ ఇంట్లో జరుగుతుంది. కన్యా రాశి వారు కోర్టు కేసులలో ఓటమిని ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాలలో ఇబ్బందులు పడతారు. అప్పులు చేయడం, అప్పులు ఇవ్వడం కూడా ఈ సమయంలో మంచిది కాదు. వర్తక వ్యాపారాలు చేసేవారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇది కన్యా రాశి వారికి నష్టాలను చేకూర్చే యోగం.
మీనరాశి
మీన రాశి వారు విషయోగం కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు .ఈ సమయంలో మీన రాశి జాతకులు తమ జీవితంలో సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీనరాశిలో 12వ ఇంట్లో శని చంద్ర సంయోగం జరుగుతుంది. ఈ కాలంలో మీన రాశి వారి ఖర్చులు బాగా పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం కాదు. ఆర్థికంగా మీన రాశి వారు ఇబ్బంది పడతారు. డబ్బు సంపాదన లోను ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. దీనివల్ల మీన రాశి వారికి ఆందోళన పెరుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications