మాట తప్పను.. త్వరలో వీరికి సంపదల సునామీ సృష్టిస్తానన్న గ్రహాల రాకుమారుడు!
నవగ్రహాలలో బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. సూర్యుడికి అతి దగ్గరగా ఉండే బుధ గ్రహానికి గ్రహాల రాకుమారుడిగా పేరుంది. బుధుడు అతి తక్కువ సమయంలో రాశిని మార్చుకుంటూ ప్రయాణం సాగిస్తాడు. ప్రస్తుతం అస్తంగత్వ దశలో ఉన్న బుధుడు వచ్చే నెలలో ఉదయించబోతున్నాడు .
వృశ్చిక రాశిలో బుధుడు ఉదయం
డిసెంబర్ 11వ తేదీన వృశ్చిక రాశిలో బుధుడు ఉదయం జరుగుతుంది. కమ్యూనికేషన్ కు, మేధస్సుకు ప్రతీకగా చెప్పే బుధుడు వృశ్చిక రాశిలో ఉదయించటం కారణంగా కొన్ని రాశుల వారి జీవితంలో పురోగతి వస్తుంది. 2025 మార్చి వరకు వృశ్చిక రాశిలో చురుగ్గా కదిలే బుధుడు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తున్నాడు. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభరాశి
వృషభ రాశి వారికి బుధుడి ఉదయం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారికి దీర్ఘకాలిక విజయాలు సొంతమవుతాయి. వీరి వృత్తి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వృషభరాశి జాతకులు ఆర్థికంగా బలపడతారు. బుధుడి అనుగ్రహంతో వృషభ రాశి వారు ఇతరుల పైన ప్రభావాన్ని చూపించగలుగుతారు.
కర్కాటక రాశి
వృశ్చిక రాశిలో బుధుడి ఉదయం కర్కాటక రాశి వారికి మేలు చేస్తుంది. కర్కాటక రాశి వారు ఈ సమయంలో వ్యాపారంలో పెట్టే పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. సృజనాత్మక రంగంలో పని చేసేవారు విజయాలను సాధిస్తారు. వ్యక్తిగతంగానే కాక వృత్తిపరంగా కూడా ధైర్యంగా ముందడుగు వేస్తారు. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో ఎటువంటి సవాళ్లను అయినా ధైర్యంగా ఎదుర్కొంటారు.
మకర రాశి
బుధుడి ఉదయం కారణంగా మకరరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. వీరు కెరీర్లో పురోగతిని సాధిస్తారు. మకర రాశి వారికి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ఉద్యోగులకు ఇది శుభసమయం. కెరీర్లో పురోగతిని సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక లాభాలు వస్తాయి. 2025 సంవత్సరంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. మకరరాశి వారి వివాదాలు పరిష్కారం అవుతాయి.
డిసెంబర్ నుండి కొన్ని రాశుల వారి తలరాతలను మారుస్తున్న బుధుడు
జాతకంలో బుధ స్థానం ఉచ్చ స్థితిలో ఉంటే సానుకూల ఫలితాలు వస్తాయి. అదే నీచ స్థానంలో ఉంటే ప్రతికూల ఫలితాలు వస్తాయి. బుధుడి కారణంగా ప్రతికూల ఫలితాలు వచ్చే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థిక అంశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బుధుడి వ్యతిరేక ప్రభావాలు తగ్గించుకోవడానికి కొన్ని నివారణలను సైతం చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా డిసెంబర్ నుండి కొన్ని రాశుల వారి తలరాతలను బుధుడు మార్చబోతున్నాడు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications