60ఏళ్ళ తర్వాత మహాశివరాత్రి నాడు అద్భుతయోగం... వీరికే సంపదల వర్షం!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. ఈ గ్రహాల సంచారం, సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. అయితే 60 సంవత్సరాల తర్వాత మహాశివరాత్రి రోజున గ్రహాల సంచారం కారణంగా ఒక అరుదైన ఘట్టం చోటు చేసుకోబోతుంది. మహాశివరాత్రి మాఘ మాసంలో వస్తుంది.
మహా శివరాత్రి... అదృష్ట రాశులు
మాఘ మాసంలో వచ్చే మహాశివరాత్రి పర్వదినాన చంద్రుడు మకర రాశిలో, రవి కుంభరాశిలో ఉండటం వల్ల ఒక అరుదైన యోగం ఏర్పడుతుంది. ఈ యోగం మూడు రాశుల వారికి అనుకోని ధనయోగంతో పాటు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి నాటి నుండి ఈ అద్భుత యోగంతో అదృష్టాన్ని పొందే రాశుల వారెవరో మనం చూద్దాం.

మిధున రాశి
మహాశివరాత్రి నుంచి మిధున రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వసూలు కానీ డబ్బు లభిస్తుంది. పెళ్ళికాని స్త్రీ, పురుషులకు వివాహ యోగం ఉంది.
సింహరాశి
మహాశివరాత్రి రోజు నుంచి సింహ రాశి వారి జీవితం మారిపోతుంది. సింహ రాశి వారికి ఈ సమయంలో అన్ని విధాల లాభాలు చేకూరుతాయి. వ్యాపారవేత్తలకు అద్భుతమైన లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇది శుభ సమయం. పెళ్ళికాని వారికి కచ్చితంగా మంచి సంబంధాలు కుదురుతాయి. దీర్ఘకాలికంగా ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు వసూలవులవుతాయి.
మేష రాశి
మహాశివరాత్రి రోజు నుండి మేష రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మేషరాశి వారికి ఈ సమయంలో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. చేతికి డబ్బులు అందుతాయి. ఈ సమయంలో ఖర్చులు కూడా కంట్రోల్ లో ఉంటాయి. ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగాలు దొరుకుతాయి. సమాజంలో పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. పెళ్ళికాని వారికి పెళ్లి యోగం కనిపిస్తుంది. పనిచేసే చోట గుర్తింపు లభిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications