2025లో ఈ రాశులవారికి మహారాజయోగం.. మా మాటే శాసనమన్న శని శుక్రులు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు కాలానికి అనుగుణంగా తమ గమనాన్ని మార్చుకుంటూ వివిధ రాశుల్లోకి సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్లే సమయంలో ఇతర గ్రహాలతో సంయోగం చెందుతాయి. ఈ సంయోగం కొన్ని రాశులకు శుభాలను మరికొన్ని రాశులకు అశుభాలను కలిగిస్తుంది. ఈ డిసెంబర్ మాసంలో శనీశ్వరుడు శుక్రుడు కుంభరాశిలో కలుసుకుంటున్నారు.
కుంభరాశిలో శుక్ర, శని సంయోగం
డిసెంబర్ 28వ తేదీన రాత్రి 11 గంటల 48 నిమిషాలకు కుంభ రాశిలో ఉన్న శనీశ్వరుడితో శుక్ర సంయోగం జరగబోతుంది. ఈ రెండు గ్రహాల కలయిక జనవరి 28 ఉదయం 7 గంటల 12 నిమిషాల వరకు దాదాపు నెలరోజుల పాటు కొనసాగుతుంది. దీంతో 2025 జనవరి మాసంలో దీని కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
సాధారణంగా శని శుక్ర గ్రహాలను స్నేహపూర్వక గ్రహాలని చెబుతారు. శని శుక్ర గ్రహాల సంయోగం వృషభ రాశి జాతకులకు సానుకూల ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వృషభరాశి జాతకులకు ఉద్యోగాలు వస్తాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఏ పని చేసినా ఈ సమయంలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది.
తులారాశి
శని శుక్రుల సంయోగం కారణంగా తులా రాశి జాతకులకు జీవితం అద్భుతంగా మారుతుంది. తులా రాశి జాతకులు ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నంతవరకు తమ జీవితంలో ఉన్నత స్థానాలకు వెళతారు. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్లు పొందుతారు. వారసత్వ ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. విద్యార్థులు ఈ సమయంలో ఎటువంటి పరీక్షలు రాసినా విజయాలు సాధించి తీరుతారు. ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది.
కుంభరాశి
శని శుక్ర గ్రహాల కలయిక కారణంగా కుంభరాశి జాతకులకు అదృష్టం కలిసొస్తుంది. కుంభరాశి వారు ఈ సమయంలో ఏం చేసినా సానుకూల ఫలితాలు వస్తాయి. వీరి ఉద్యోగ జీవితంలో గొప్ప మార్పులు వస్తాయి. పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. సమాజంలో గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా చాలా బలంగా ఉంటుంది. పెళ్ళికాని వ్యక్తులకు పెళ్లిళ్లు అయ్యే సూచనలు ఉన్నాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications