పుష్య నక్షత్ర యోగంతో ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి కోటీశ్వరులయ్యే రాశులివే!
జనవరి 14వ తేదీన అంటే నేడు సూర్యభగవానుడు తన కొడుకు అయిన శని రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని రాశి అయిన మకరరాశిలో సూర్యసంచారం ఈసారి చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. పుష్య నక్షత్ర యుక్తంగా నేడు సూర్య సంచారం జరగడం వల్ల పుష్య నక్షత్ర యోగం ఏర్పడుతుంది.
పుష్య నక్షత్ర యోగం
ఈ శుభయోగం ఈరోజు ఉదయం 10.17 నిమిషాలకు ప్రారంభమై జనవరి 15వ తేదీ ఉదయం 10.28 నిమిషాలకు ముగుస్తుంది. ఇక పుష్య నక్షత్ర యోగంతో కొన్ని రాశులు అదృష్ట రాశులుగా మారుతున్నాయి. పుష్య నక్షత్ర యోగం కారణంగా లబ్ధిని పొందే ఆ రాశులు వివరాలు తెలుసుకుందాం.

కర్కాటక రాశి
పుష్య నక్షత్ర యోగంతో కర్కాటక రాశి జాతకులకు మేలు జరుగుతుంది. శని దేవుడి ఆశీస్సులు ఈ రాశి వారిపైన ఉంటాయి. కర్కాటక రాశి జాతకులు అన్ని రంగాలలో విజయాలను సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఈ సమయంలో వీరు ఆకస్మిక ధన లాభాలను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారుల మన్ననలు లభిస్తాయి. శుభకార్యాలతో ఇల్లు సంతోషంగా మారుతుంది.
తులారాశి
పుష్య నక్షత్ర యోగం కారణంగా తులా రాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. ఈ సమయంలో వృత్తి వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. డబ్బును ఆదా చేస్తారు. పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయం జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
మకర రాశి
పుష్య నక్షత్ర యోగం కారణంగా మకర రాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఎప్పటి నుంచో పూర్తికాని పనులు పూర్తి చేసుకుంటారు. ఒత్తిడి తగ్గుతుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఒకేసారి అనేక మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చి పడతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి.
కుంభరాశి
పుష్య నక్షత్ర యోగం కుంభరాశి జాతకులకు ఫలవంతంగా మారుతుంది. శని అనుగ్రహం వల్ల చేపట్టే ప్రతి పని విజయవంతం అవుతుంది. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. శత్రువుల పైన విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుపడుతుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications