నీవు-నేను ఒకటి, నీవు-నేను వేరు: భక్తి అంటే ఏమిటి?
డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

భక్తి అంటే విభక్తము కానిది. నువ్వు వేరు నేను వేరు అంటే విభక్తము. భక్తి అంటే నీవు, నేను ఒకటే! కాని నీవు భగవంతునితో ఎలా ఉన్నావు? నీవు వేరు నేను వేరుగా ఉన్నావు. భక్తిని ఆచరించనప్పుడు విభక్తంలో ఉన్నావు. భక్తిని ఆచరించి నప్పుడు నీవు, నేను ఒక్కటే అయ్యావు. నీవు నేను ఒక్కటే అనేది నిశ్చలంగా ఉండాలి. అదే భక్తి అంటే!
"జీవేశ్వరో భిన్నః ఇతి ప్రథమ భ్రమః" జీవుడు అనే వాడికి అయిదు భ్రమలు ఉన్నాయి, ఆ అయిదు భ్రమల వలెనే నీకు జీవభావం నిలబడి ఉంటుంది, నువ్వు నేను వేరు అనే భ్రమ మనలో ఎంతగా బలపడింది అంటే నీవు నేను ఒకటే రా అని ఆ భగవంతుడే దిగి వచ్చి చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. భగవంతుడు శంకరుడు ఆదిశంకరుల రూపంలో నడయాడి ఆసేతు హిమాచలం అందరికి చెప్పారు, ఉన్నది ఒక్కటే! భగవంతుడు ఒక్కడే, మీరందరూ నడయాడే దైవమె, నీవు నేను ఒక్కటే!
"పునః సత్యం పశ్యత్ సత్యం ధృవ పునః సత్యం పునః సత్యం సత్యమేవచ"
నేను సత్యమే చెపుతున్నాను వెయ్యి సార్లు చెప్తున్నాను భగవంతుడే సాక్షాత్తు అవతార మూర్తిగా వచ్చి చెప్పినా నమ్మనంతగా భ్రాంతి భ్రమ బలపడింది. వీటి నుండి బయటపడి ఉప్పు నీళ్ళల్లో ఎలా కలసిపోతుందో, అలాగే నీవు భగవంతుడిలో కలసిపోవటమే భక్తి. కలిసి పోయానన్న ఉనికిని కూడా కోల్పోవటమే జ్ఞానం. జ్ఞానాన్ని పొందాలంటే ముందు నిశ్చల మైన భక్తి కావాలి.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
నవ పంచమ రాజయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం












Click it and Unblock the Notifications