లక్ష్మీనారాయణ యోగం అంటే ఏమిటి? ఈ యోగం ఎప్పుడు వస్తుంది? అసలేం జరుగుతుంది?
జ్యోతిష్య శాస్త్రంలో అనేక యోగాలు సూచించబడ్డాయి. రాశి, అంశ చక్రాలలో ఉన్న గ్రహ స్థానాలను బట్టి ఈ యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలను అనుసరించి వివిధ రాశీ చక్రాల వారి జాతకాలపై ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో ప్రధాన గ్రహాల సంచారం వల్ల, కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది.
ఈ లక్ష్మీనారాయణ యోగానికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది.ఈ లక్ష్మీనారాయణ యోగం రాశుల వారి జీవితాలలో గణనీయమైన మార్పులను తీసుకువస్తుంది. జులై 23వ తేదీన బుధుడు తిరోగమన కి వెళుతుండగా ఆ తర్వాత రెండు రోజులకు శుక్రుడు బుధుడు సింహరాశిలో చేరినప్పుడు లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. జులై 25న లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది.

బుధుడు మరియు శుక్రుడు కలయికతో ఏర్పడే యోగమే లక్ష్మీనారాయణ యోగం. ఈ యోగం సాధారణంగా రాశుల వారికి శుభ యోగంగా చెప్పొచ్చు. ఎందుకంటే బుధుడు మేధస్సుకు, వ్యాపారాలు వృద్ధి చేసే గ్రహంగా చెప్తారు . శుక్రుడు సంతోషాన్ని, లగ్జరీ ని ఇచ్చే గ్రహంగా చెప్తారు. ఈ రెండు గ్రహాల కలయిక కూడా ఆయా రాశి చక్రాల జాతకులపై అదే విధమైన ప్రభావాలను కూడా చూపిస్తుంది.
సహజంగా ఈ కలయిక వల్ల అన్ని రాశుల వారి సామర్ధ్యం పెరుగుతుంది. వారి తెలివితేటలు ఇనుమడింపబడతాయి. మరికొద్ది రోజుల్లో ఏర్పడనున్న లక్ష్మీనారాయణ యోగం ముఖ్యంగా మిధున రాశి, కన్యారాశి, తులారాశి వ్యక్తుల జీవితాలలో సానుకూలమైన ప్రభావాలను తీసుకువస్తుంది. వారు లక్ష్మీనారాయణ యోగం ప్రభావం వల్ల అదృష్ట జాతకులు గా మారుతారు. లక్ష్మీనారాయణ యోగం ద్వాదశ రాశుల వారికి మేలే చేస్తుంది.
కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. చాలా రాశులకు విజయాన్ని, సంపదను, శాంతిని, ఆధ్యాత్మికతను, శ్రేయస్సును కలిగిస్తుంది. ఇక లక్ష్మీనారాయణ యోగం తో పాటు ఎవరైతే లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారో వారికి కూడా కనక వర్షం కురుస్తుందని చెబుతారు. ఇక లక్ష్మీనారాయణ యోగం నాడు లక్ష్మీదేవిని పూజించడానికి పరిశుభ్రతను పాటిస్తూ లక్ష్మీ మంత్రాన్ని జపించి, లక్ష్మీదేవికి పూజ చేయాలని, బాలికలకు తెల్లని స్వీట్లను పంచాలని సూచించబడింది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications