• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జ్యోతిషంను ఎవరు అందించారు: ఏది శుభం, ఏది అశుభం?

|

జ్యోతిష్యం లేదా జోస్యం , భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. జీవి జీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేదీ జననకాల గ్రహస్థితి ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది.

ఆరు వేదాంగాలలో జ్యోతిష్యం ఒకటి. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీనశాస్త్రాలలో ఇది కూడా ఉంది. మొట్టమొదటిగా జ్యోతిష్య శాస్త్రాన్ని గ్రంధరూపంలో వరాహమిహిరుడు అందించాడు. హిందూ సాంప్రదాయాల మరియు విశ్వాసాలలో జన్మ సిద్దాంతం ఒకటి. జన్మసిద్దాంతం ప్రకారము పూర్వ జన్మ పాపపుణ్యాల ప్రభావం ప్రస్తుత జన్మలో ఉంటుంది.దానికి తగిన విధంగా, తగిన సమయంలోనే జీవి జననం ఈ జన్మలో జరుగుతుంది.

అనగా అటువంటి గ్రహస్థితిలో జీవి జననం జరుగుతుంది. ఇది అంతా దైవలీలగా హిందువులు భావిస్తారు. కావున ప్రతి జీవి భూత భవిష్యత్ వర్థమాన కాలములు జననకాల గ్రహస్థితి ప్రకారము జరుగుతాయి. ఇది హిందువుల ప్రగాఢ విశ్వాసము.హస్తసాముద్రికము, గోచారము, నాడీ జ్యోస్యము, న్యూమరాలజీ, ప్రశ్న చెప్పడం, సోది మొదలైన విధానాలుగా జ్యోస్యం చెప్పడం వాడుకలో ఉంది.

What is the astrology?

పురాణాలలో జ్యోతిష్యం

శ్రీనివాసుడు పద్మావతిని చేపట్టడానికి సోది చెప్పే స్త్రీ రూపంలో వచ్చి తన ప్రణయ వృత్తాంతాన్ని ఆకాశరాజు దంపతులకు తెలిపి వారిలో తమ వివాహం పట్ల సుముఖత కలిగించి పద్మావతిని పరిణయమాడటంలో విజయం సాధించనట్లు పురాణ కథనాలు చెప్తున్నాయి.

కంసుడికి మేనల్లుడి రూపంలో మరణం పొంచివున్నట్లు ఆకాశవాణి ముందుగానే వినిపించింది.

శిశుపాలుని మరణం కృష్ణుని ద్వారా సంభవించనున్నదని పెద్దలు చెప్పినట్లు అందువలన శిశుపాలుని తల్లి కృష్ణుని నుండి నూరు తప్పుల వరకు సహించేలా వరం పొందినట్లు భారతంలో వర్ణించబడింది. ఆ తరువాత నూరు తప్పులు చేసి శిశుపాలుడు కృష్ణుని చేతిలో మరణించడం లోక విదితం.

ఐదుగురు మహావీరులు ఒకే నక్షత్రంలో పుడతారని, వారిలో మొదటిసారిగా ఎవరు ఎవరిని సంహరిస్తారో, మిగిలిన ముగ్గురు అతని చేతిలోనే మరణిస్తారని ముందుగానే చెప్పడం జరిగింది.

ఆ ఐదుగురు మహావీరులు ఎవరంటే భీముడు, ధుర్యోధనుడు, జరాసంధుడు, బకాసురుడు, కీచకుడు. అందుకే గాంధారి తన కుమారుడు దుర్యోధనుడిని బ్రతికించడానికి, అతని శరీరాన్ని వజ్రకాయంగా మార్చడానికి శక్తివంతమైన మూలికా ఔషధాన్ని అతనికి రాస్తున్నప్పుడు, దానిని చెడగొట్టడానికే, పనిగట్టుకుని మరీ శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి, దుర్యోధనుడిని ఆయుఃక్షీణుడిని చేసాడనే విషయం కూడా లోక విదితమే

త్రిజటా స్వప్నవృత్తాంతము శ్రీ రాముడు రావణుని వధించి సీతమ్మను విడిపించినట్లు త్రిజట వాల్మీకి పలికించడం స్వప్న ఆధారిత జ్యోస్యం వాడుకలో ఉన్నదని చెప్పడానికి నిదర్శనం.

జానపదుల

చిలుక జోస్యం, పుల్లల జోస్యం, రాగుల జోస్యం, చిప్పకట్టె జోస్యం, అంజన పసరు జోస్యం, చెంబు జోస్యం మొదలైనవి జానపదుల జోస్యాలు.బాలసంతు వారు శైవులు.తెల్లవారు ఝామున గంట వాయిస్తూ ఇంటింటికి వచ్చి ఇంటి యజమాని విన్నా వినకపోయినా జోస్యం చెప్పి వెళతారు.

ప్రశ్నా శాస్త్రం జ్యోతిష శాస్త్రంలో ప్రశ్నాశాస్త్రం ప్రాముఖ్యత సంతరించుకుంది.

ప్రశ్నా శాస్త్ర సంబంధిత విషయాలు శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణంలో లభ్యమవుతాయి. కనుక ఈ శాస్త్రం ఆతి పురాతన కాలం నుండి ప్రాచుర్యం పొంది ఉంది. ప్రశ్నఅడగడం అన్నది అప్పటి నుండి ఇప్పటి వరకు వాడుకలో ఉన్న విషయమే. అనేక రూపాలలో ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్ళున్నా జ్యోతిష శాస్త్ర పండితులు అతి జాగరూకతతో గణించి చెప్పే సమాధానాలు విశ్వసించ దగినవి. ప్రశ్నా శాస్త్రానికి సమాధానం చెప్పాలంటే సాధారణంగా జాతక చక్రాన్ని చూసి చెప్పే కంటే విశేష పాండిత్యం అవసరమౌతుంది.

పురాణాలలో ప్రశ్నా శాస్త్రాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. పృచ్ఛకుడు ఎలా ఉండాలి, ఏ సమయంలో ప్రశ్న అడగాలి. ఎలాంటి ప్రదేశంలో అడగాలి మొదలైన అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. అలాగే ప్రశ్నను చెప్పే పండితుడు ఎలా చెప్పాలి అనే విషయాలు ప్రస్తావించబడ్డాయి. వాటిలో శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణంలో ప్రస్తావించబడిన విషయాలు ఇక్కడ చూడవచ్చు.

ప్రశ్నచెప్పే జ్యోతిష పండితుడు శుభ్రమైన వస్త్రధారణ చేసి ఉండాలి. శ్వేతవస్త్రధారణ మరింత శ్రేష్టం.

ప్రశ్నచెప్పే జ్యోతిష పండితుడు మంచి మనసు కలవాడై ఉండాలి.

ప్రశ్నచెప్పే జ్యోతిష పండితుడు శుభసమయంలో సమాధానం చెప్పాలి.

చెప్పే జ్యోతిష పండితుడు తలంటుకున్న సమయంలో, దుఃఖితుడై ఉన్న సమయంలో, వికలమై మనస్సు కల్లోలితమైన సమయంలో, తల విరబోసుకున్న సమయంలో, భీమి మీద నిలబడి ఉన్న సమయంలో సమాధానం చెప్పకూడదు. అలాంటి సమయంలో పండితుడిని ప్రశ్న అడగకూడదు. ఆ పరిస్థితిలో చెప్పే సమాధానం అశుభాన్ని కలిగిస్తుంది.

ప్రశ్న అడిగే ప్రదేశం పట్టి ఫలితాలు ఉంటాయి.

పూలున్న ప్రదేశం, వృక్షములు ఉన్న ప్రదేశం, పచ్చిక మైదానాలు, నదీతీరాలు, సరస్సు తీరాలు, చక్కగా లక్ష్మీకళుట్టిపడుతున్న భవనాలలో చెప్పే సమాధానం

శుభఫలితాలు ఇస్తాయి.

ప్రశ్న అడుగు పృచ్ఛకుడు శ్మశానం, కబేళా (మాంస విక్రయ శాల), కారాగారం, నడి రోడ్డు, బురదగల ప్రదేశం, పాడుబడిన కట్టడాలు, పాడుబడిన గృహములు, ఎలుకలు కలుగులు, పాము కన్నాలు, పురుగులు ఉన్నప్రదేశంలో అడిగిన అశుభఫలితాలు కలుగుతాయి.

దండహస్తులు (చేత కర్రలు పట్టుకున్న వాళ్ళు), కాషాయ వస్త్ర ధారులు, తల అంటుకున్న వాళ్ళు, జాతి భ్రష్టులు, నపుంసకులు, స్త్రీలు, సంకెళ్ళు తాళ్ళు పట్టుకున్న వాళ్ళు, తాడి పండ్లు చేత పట్టున్న వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఫలితం భయంకరం ఫలితాలను ఇస్తుంది.

సంధ్యా సమయం, మిట్ట మధ్యాహ్నం, మధ్యాహ్నానికి ముందు సమయం, రాత్రి వేళలు అడిగిన అశుభ ఫలితం ఇస్తుంది.ఉత్తర దిక్కు, ఈశాన్య మూల, తూర్పు దిక్కున నిలిచి అడిన శుభ ఫలితం ఇస్తుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In the West, astrology most often consists of a system of horoscopes purporting to explain aspects of a person's personality and predict future events in their life based on the positions of the sun, moon, and other celestial objects at the time of their birth.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more