వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోమతి చక్రాలు: ఏమిటివి, ఎక్కడ లభిస్తాయి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

గోమతి చక్రాలు అరుదైన సహజసిధ్ధంగా లభించే "సముద్రపు శిల". గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు గల ద్వారకలోని గోమతినది నందు లభిస్తాయి. చంద్రుడు వృషభరాశిలోని రోహిణి లేదా తులారాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతో ఇవి రూపు దిద్దుకుంటాయి. ఈరెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం. ఈ శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీ దేవికి సోదరుడు కావటం వలన ఈ చక్రాల ఉపయోగం అనేకం అనంతం అని చెప్పవచ్చును. జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్ధ్యానికి, ప్రేమ, దాంపత్య సౌఖ్యం, సౌభాగ్యాలకు కారకత్వం వహిస్తుండటం వలన గోమతి చక్రాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి.

గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. దీనినే "నాగచక్రం" అని "విష్ణుచక్రం" అనికూడ అంటారు. ఇది నత్త గుళ్ళ ఆకారాన్ని పోలి ఉంటుంది. అందువల్ల దీనిని "నత్త గుళ్ళ స్టోన్" అని కూడ అంటారు. గోమతిచక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ గాను ఉంటుంది. గోమతిచక్రం ముందుభాగం తెల్లగాను, కొన్నిఎర్రగాను ఉంటాయి. తెల్లగా ఉన్న గోమతిచక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకి, సకలకార్యసిధ్ధికి, ఆరోగ్యసమస్యలకి, ధరించటానికి ఉపయోగపడతాయి. ఎర్రగా ఉన్నగోమతిచక్రాలు వశీకరణానికి, శత్రునాశనానికి, క్షుద్ర ప్రయోగాలకి, తాంత్రిక ప్రయోగాలకి మాత్రమే ఉపయోగించాలి.

What is the Gomti Chakra, and how does it work?

గోమతి చక్రాలలో ఆరు, తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి. సంఖ్యాశాస్త్రంలో ఆరు శుక్ర గ్రహానికి, తొమ్మిది కుజ గ్రహానికి చెందుతాయి. జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలో విఫలం కావటం, వివాహం అయిన తరువాత రతికి ఆసక్తిని కనబర్చక పోవటం వంటి దోషాలు సైతం గోమతిచక్ర ధారణవల్ల నివారించబడతాయి. గోమతి చక్రాలను సిధ్ధం చేసుకున్న తరువాత వాటిని ముందుగా గంగాజలం నీళ్ళతో లేదా పసుపు నీళ్ళతో గాని కడిగి పరిశుబ్రమైన బట్టతో తుడవాలి. గోమతిచక్రాలను శ్రీయంత్రం లేదా అష్టలక్ష్మీయంత్రం గాని పీటం మీద గాని ఉంచాలి.

గోమతిచక్రాలను "ఓం హ్రీం మహాలక్ష్మీ శ్రీ చిరాలక్ష్మీ ఐం మమగృహే ఆగచ్ఛ ఆగచ్ఛ స్వాహా" అనే మంత్రంతో గాని లలితాసహస్త్ర నామంతో గాని జపిస్తూ కుంకుమతో లేదా హానుమాన్ సింధూరంతో గాని అర్చన చేయాలి.

గోమతిచక్రాల పూజ శుక్రవారం రోజు గాని దీపావళి రోజు గాని వరలక్ష్మి వ్రతం రోజుగాని చేసుకొని మనకు కావలసిన సమయాలలో వీటిని ఉపయోగించుకోవచ్చు. పూజ చేసిన గోమతిచక్రాలను పూజామందిరంలో గాని బీరువాలో గాని ఉంచి మనకు అవసరమైనప్పుడు వాటిని తీసి ఉపయోగించు కోవచ్చు. గోమతిచక్రాలను ఎప్పుడు ఎర్రని బట్టలో గాని, హనుమాన్ సింధూరం లో గాని ఉంచాలి. గోమతిచక్రాలను పిరమిడ్ లోపల గాని వెండి బాక్స్ లోపల గాని ఉంచి కొద్దిగా హనుమాన్ సింధూరం లేదా కుంకుమతో పాటు ఉంచాలి.

'ఒక్క గోమతిచక్రాన్ని' త్రాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగ నిరోదక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలనుండి విముక్తి కలుగుతుంది. గోమతిచక్రాన్ని లాకెట్ లాగ ధరిస్తే నరదృష్టి బాధల నుండి విముక్తి కలుగుతుంది. బాలారిష్టదోషాలు కూడ పోతాయి.

'రెండు గోమతిచక్రాలను' బీరువాలో గాని పర్సులో గాని ఉంచితే దనాభివృధ్ధి ఉండి ఎప్పుడు ధనానికి లోటు ఉండదు.రెండు గోమతిచక్రాలను భార్యా భర్తలు నిద్రంచే పరుపు కింద గాని దిండు కింద గాని ఉంచినట్టయితే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు.

'మూడు గోమతిచక్రాలను' బ్రాస్‌లెట్‌గా చేసుకొని చేతికి ధరిస్తే జనాకర్షణ, కమ్యూనికేషన్, సహాకారం లభిస్తుంది. మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వని వారి పేరు గోమతిచక్రాల మీద నల్లని కాటుక గాని బొగ్గు పొడితో గాని అతని పేరు వ్రాసి నీటిలో వేయటం లేదా వాటిని వెంట పెట్టుకొని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళితే అతను తీసుకున్న డబ్బులను త్వరగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది.ఈ ప్రయోగాన్ని మంగళవారం రోజు చేస్తే ప్రయోజనం కలుగుతుంది.

'నాలుగు గోమతిచక్రాలు' పంట భూమిలో పొడిచేసి గాని మాములుగా గాని చల్లటం వలన పంట బాగా పండుతుంది. గృహనిర్మాణ సమయంలో గర్భ స్ధానం లో నాలుగు గోమతిచక్రాలు భూమిలో స్ధాపించటం వలన ఆ ఇళ్ళు త్వరితగతిన పూర్తి చేసుకొని అందులో నివసించే వారికి సకల ఆయురారోగ్య, ఐశ్వర్యాలు కలిగి ఉందురు. నాలుగు గోమతిచక్రాలను వాహనానికి కట్టటం వలన వాహన నియంత్రణ కలిగి వాహన ప్రమాదాలనుండి నివారించబడతారు.

'ఐదుగోమతిచక్రాలు' తరుచు గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకు కట్టటం వలన గర్భం నిలుస్తుంది. ఐదు గోమతిచక్రాలు పిల్లలు చదుకొనే బుక్స్ దగ్గర ఉంచటం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది. తరుచు ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి. పుత్రప్రాప్తి కోసం 5 గోమతిచక్రాలను నది లోగాని జలాశయంలో గాని విసర్జితం చేయాలి.

'ఆరు గోమతిచక్రాలు' అనారోగ్యం కలిగిన రోగి మంచానికి కట్టటం వలన తొందరగా ఆరోగ్యం కుదుటపడుతుంది. శత్రువులపై విజయం సాదించవచ్చు. కోర్టు గొడవలు ఉండవు. విజయం సాదించవచ్చును.

'ఏడు గోమతిచక్రాలు' ఇంటిలో ఉండటం వలన వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇతరులతో సామాజిక సంబందాలు బాగుంటాయి. ఏడు గోమతి చక్రాలను నదిలో విసర్జితం చేసిన దంపతుల మధ్య అభిప్రాయబేధాలు మటుమాయం అవుతాయి.

'ఎనిమిది గోమతిచక్రాలు' అష్టలక్ష్మీ స్వరూపంగా పూజించిన ధనాభివృద్ధి కలుగుతుంది.

'తొమ్మిది గోమతిచక్రాలు'ఇంటిలో ఉండటం వలన మన ఆలోచన లని ఆచరణలో పెట్టవచ్చు. ఆద్యాత్మికచింతన కలుగుతాయి. ఆ ఇంటిలోని వ్యక్తులు గౌరవించబడతారు.

'పది గోమతిచక్రాలు' ఆఫీసులో ఉంచటం వలన ఆసంస్ధకి అమితమైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. మరియు వారు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలతో గుర్తించబడతారు.

'పదకొండు గోమతిచక్రాలు' లాభలక్ష్మి స్వరూపంగా పూజించిన ఆర్ధికాభివృద్ధి కలుగుతుంది. భవననిర్మాణ సమయంలో పునాదిలో పదకొండు గోమతి చక్రాలను ఉంచటం వలన ఎటువంటి వాస్తుదోషాలు, శల్యదోషాలు ఉండవు.

'పదమూడు గోమతిచక్రాలను' శివాలయంలో దానం చేసిన ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది.

'ఇరవై ఏడు గోమతిచక్రాలు' వ్యాపార సముదాయములలో ద్వారబందానికి కట్టి రాకపోకలు ఆద్వారం గుండా చేస్తే వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది.

జాతకచక్రంలో నాగదోషం, కాలసర్పదోషం ఉన్నవారు పంచమస్ధానంలో ఉన్న రాహువుకి పాపగ్రహాలదృష్టి గాని, సాంగత్యం గాని ఉన్న సంతాన దోషం ఉంటుంది. దీనినే నాగదోషం అంటారు. జాతకచక్రంలో రాహు కేతువుల మద్య అన్ని గ్రహాలు ఉన్నప్పుడు దానిని కాలసర్పదోషం అంటారు. ఈ రెండు దోషాలు ఉన్న వారు గోమతి చక్రాలను పూజచేయటం గాని, దానం చేయటం గాని, గోమతిచక్రాన్ని మెడలో లాకెట్‌గా ధరించటం గాని చేయాలి.

English summary
Gomti Chakra is a rare natural and spiritual product, a form of shell stone. Gomti Chakra is found in gomti River in Dwarka, a part of Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X