చాతుర్మాసం 2023 ఎప్పుడు మొదలవుతుంది? చాతుర్మాస వ్రత విధి విధానాలేంటి?

చాతుర్మాస సమయం దగ్గరకు వస్తోంది. చాతుర్మాసం ఆషాడ మాసం లోని దేవ శయన ఏకాదశినాడు ప్రారంభమై, కార్తీక మాసం లోని ఉత్థాన ఏకాదశి నాడు ముగుస్తుంది. నాలుగు నెలల పాటు సాగే ఈ మాసాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. చాతుర్మాస కాలంలో విష్ణువు నిద్రలోకి జారుకుంటారు అని, నాలుగు నెలల పాటు ఆయన నిద్రిస్తూనే ఉంటారని చెబుతారు.

ఈ సంవత్సరం చాతుర్మాసం జూన్ 29వ తేదీన ప్రారంభమైన నవంబర్ 23 వ తేదీ వరకు కొనసాగుతుంది. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలు చాతుర్మాస కాలాన్ని కలిగి ఉంటాయి. అయితే చాతుర్మాస కాలంలో చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే శుభాలు జరుగుతాయని, ఆ విష్ణుదేవుడి కృపాకటాక్షాలు ఉంటాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇక చాతుర్మాస వ్రతం ఏ విధంగా చేస్తారు? దాని విధివిధానాలు ఏమిటి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

When does Chaturmas 2023 start? What are the rules to follow in Chaturmas Vrat?

చాతుర్మాస వ్రతాన్ని అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు ఎలాంటి లింగ వివక్ష లేకుండా ఆచరించవచ్చు. బ్రహ్మచారులు, గృహస్తులు, వృద్ధులు, సన్యాసులు ప్రతి ఒక్కరు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. చాతుర్మాస వ్రతం ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించింది. చాతుర్మాస వ్రతం పాటించేవారు ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. వీరు ఈ నాలుగు మాసాలలో కొన్ని ఆహార పదార్థాలను తినడాన్ని విడిచిపెట్టాలి.

శ్రావణమాసంలో ఆకుకూరలు, భాద్రపద మాసంలో పెరుగు, ఆశ్వయుజ మాసంలో పాలు, కార్తీకమాసంలో పప్పు పదార్థాలను వీరు తినకూడదు. ఈ నాలుగు మాసాలు తాము నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు. సూర్యోదయం కాకముందే స్నానం చేసి అత్యంత నిష్టతో ఇష్ట దేవతలను పూజించి దీక్షను పాటించాలి.

భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి. యోగ సాధన చెయ్యాలి. వ్రత కాలంలో ఎవరైనా సరే బ్రహ్మచర్య దీక్షను ఆచరించాలి. ఒంటి పూట భోజనం చేయాలి. నేలపైనే నిద్రించాలి. అహింసను ఆచరించాలి. భాగవతంలోని కథలు వింటూ ఈ నాలుగు మాసాలు గడపాలి. పూర్తిగా భక్తి చింతనతోనే ఉండాలి. దానధర్మాల వంటి కార్యక్రమాలు చెయ్యాలి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+