వినాయక చవితి ఎప్పుడు? 18నా .. 19నా? ఎప్పుడు జరుపుకోవాలి అంటే!!
హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ వినాయకచవితి పండుగ. వినాయక చవితి పండుగను సమిష్టికి చిహ్నంగా కూడా చెప్తారు. వాడవాడలా అందరూ కలిసి వినాయక మండపాలు ఏర్పాటు చేసి అత్యంత భక్తి, శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు. ఈ ఏడాది కూడా వినాయక చవితికి అప్పుడే ఏర్పాట్లు మొదలయ్యాయి.
వినాయక విగ్రహాల తయారీ పెద్ద ఎత్తున సాగుతుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ గణేష్ చతుర్థిని జరుపుకోవటానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ సంవత్సరం వినాయక చవితి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి? కొంతమంది 18వ తేదీన వినాయక చవితిని జరుపుకోవాలని, కొంతమంది 19వ తేదీన వినాయక చవితిని జరుపుకోవాలని వాదిస్తున్నారు. అసలు ఇంతకీ వినాయక చవితిని ఎప్పుడు జరుపుకోవాలి? అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తికర చర్చగా మారింది.

పురాణాల ప్రకారం భాద్రపద మాస శుక్లపక్ష చవితి రోజు విఘ్నేశ్వరుడి జననం జరిగినట్లుగా చెబుతారు. అయితే ఈ సంవత్సరం చవితి 18, 19 తేదీలలో ఉండడంతో ఎప్పుడు వినాయక చవితి జరుపుకోవాలి. ఎప్పుడు వినాయకుడిని ప్రతిష్టించుకోవాలి అని అందరూ తర్జనభర్జన పడుతున్నారు. పురాణాల ప్రకారం ప్రణవ స్వరూపుడైన గణపతి మధ్యాహ్నం వేళ పార్వతీ తనయునిగా ఆవిర్భవించాడు
కాబట్టి మధ్యాహ్నం సమయంలో చవితి గడియలు ఏ రోజున ఉంటే, ఆ రోజునే వినాయక చవితిగా జరుపుకోవాలని చెబుతున్నారు. ఈ క్రమంలో 18వ తేదీన మధ్యాహ్నం సమయంలో చవితి ఘడియలు ఉండడం వల్ల 18వ తేదీన వినాయక చవితి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 19వ తేదీ మధ్యాహ్నానికి చవితి ఘడియలు ఉండవు కనుక 19ని ప్రామాణికంగా తీసుకోరాదని అంటున్నారు.
18వ తేదీ మధ్యాహ్నం సమయానికి చవితి తిథి ఉండడంవల్ల 11 గంటల నుండి రెండు గంటల సమయం విఘ్నేశ్వరుని ప్రతిష్టించి పూజించటం మంచిదని వివిధ ఆలయాల పండితులు సూచిస్తున్నారు. కనుక వినాయక చవితి విషయంలో సంశయాలు విడిచిపెట్టి 18వ తేదీన పండుగ జరుపుకోవాలని పలువురు పండితులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications