ఏ రాశిలో పుట్టినవారికి ఏ ముఖ ద్వారం గల ఇల్లు కలిసొస్తుంది?
ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఒక్కొక్కసారి కలిసి రాకుండా పోతుంది. సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించుకున్న కలల సౌధంలో వారు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించలేరు. ఆ ఇల్లు వారికి నష్టాలను కలుగజేస్తుంది. పూజలు చేసినా, ఎన్ని శాంతులు హోమాలు జరిపించినా, పరిస్థితులు చక్కబడవు. అయితే ఇల్లు నిర్మించుకునే వారికి అది రాశుల ప్రకారం ఏ ముఖద్వారం ఉన్న ఇల్లు మంచిదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆ వివరాలను తెలుసుకుందాం.
ద్వాదశ రాశులలో మొదటి రాశి అయిన మేషరాశిలో పుట్టిన వారికి తూర్పు ముఖద్వారం గలిగిన ఇల్లు బాగా కలిసి వస్తుంది. వృషభ రాశి వారికి దక్షిణ ముఖద్వారం గల ఇల్లు బాగా కలిసి వస్తుంది. మిధున రాశి వారికి పశ్చిమ ముఖద్వారం గల ఇల్లు బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారికి ఉత్తర ముఖంగా ఉన్న ఇల్లు బాగా కలిసి వస్తుంది.

సింహ రాశి వారికి తూర్పు అభిముఖంగా ఉన్న ఇల్లు బాగా కలిసి వస్తుంది. కన్యా రాశి వారికి పశ్చిమ ముఖద్వారంగా గల ఇల్లు కలిసి వస్తుంది. తులా రాశి వారికి దక్షిణ ముఖద్వారం కలిగిన ఇల్లు బాగా కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారికి ఉత్తర ముఖ ద్వారం కలిగిన ఇల్లు బాగా కలిసి వస్తుంది.
ధనుస్సు రాశి వారికి తూర్పు ముఖద్వారం ఉన్న ఇల్లు బాగా కలిసి వస్తుంది. మకర రాశి వారికి దక్షిణ ముఖద్వారం గలిగిన ఇల్లు బాగా కలిసి వస్తుంది. కుంభ రాశి వారికి పశ్చిమ ముఖద్వారం గలిగిన ఇల్లు బాగా కలిసి వస్తుంది. మీన రాశి వారికి ఉత్తర ముఖద్వారం కలిగిన ఇల్లు బాగా కలిసి వస్తుంది.
ముఖ ద్వారాన్ని నిర్మించ లేనప్పుడు మీ రాశికి సరిపడే దిక్కున ఒక కిటికీ నైనా అమర్చితే సరిపోతుంది. తూర్పు మరియు ఉత్తర ద్వారాలు ఏ రాశి వారికి అయినా ఉత్తమమైనవి అని చెప్పవచ్చు. దక్షిణ మరియు పశ్చిమ ద్వారాలు అవి సరిపడే రాశుల వారికి తప్ప మరొకరికి మంచి జరగదని చెబుతున్నారు.
గృహనిర్మాణం చేసేటప్పుడు తప్పని సరిగా ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మన జీవిత కాలం కన్నా మనం నిర్మించిన ఇల్లు లేదా ఏదైనా కట్టడం ఎక్కువకాలం మన్నుతుంది. కాబట్టి మన తరువాత ఆ నిర్మాణం లో జీవించబోయేవారి సుఖశాంతులను కూడా దృష్టి లో పెట్టుకుని నిర్మాణాలను చేపట్టాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications