దీపావళి రోజునే లక్ష్మీ పూజ ఎందుకు?
ఆశ్వయుజ కృష్ణ అమావాస్య దీపావళి అమావాస్య దీపమాలికలతో లక్ష్మికి నీరాజనమీయబడే దినంకావడంచేత దీనికి దీపావళి అనే పేరు వచ్చింది.
నరకలోకవాసులకై దీప + ఆవళి కల్పించే దినము కాబట్టి దీనికి దీపావళి అనే పేరు వచ్చింది.
హిందూ మత సంస్కృతికి, హిందూమత సంప్రదాయానికి దీపావళిపర్వం ఒక చిహ్నమని చెప్పవచ్చు.
1. రాక్షసరాజైన బలిచక్రవర్తి పాతాళానికి విష్ణువుచే అణగదొక్కబడిన దినం కావడంచేత ఇది ఒక మహోత్సవ దినంగా పరిగణించబడుతూ ఉంది.
2. శ్రీరాముడు పట్టాభిషిక్తుడైన దినం కావున మహోత్సవం ఏర్పాటైంది.
3. విక్రమశక స్థాపకుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషేకం పొందిన దినం
లక్ష్మీదేవి ఈనాడు భూలోకానికి దిగి వచ్చి ఇల్లిల్లు తిరుగుతుందని ప్రజల విశ్వాసం. కాగా ఇండ్ల శుచిగా ఉంచాలి.
మధ్యాహ్నం పిండి వంటలతో భోజనం, భోజనానంతరం జూదం ఆడడం, లక్షీదేవి తమ యింటికి రావడానికి దారిచూపేందుకు దీపాలు,
మహారాష్ట్ర దేశంలో దీపావళి ఐదు రోజుల పండుగ. దీపావళి అనగా దీపాలసమూహమని అర్థం.
ఈ పర్వం మహారాష్ట్రదేశంలో అతి ప్రాచీన కాలం నుంచి వున్నట్ల కనిపిస్తుంది, వామనమూర్తి బలిచక్రవర్తిని పాతాళ లోకంలోకి అణిచివేసి అతని కారాగారంలో వున్న దేవతల్ని విడుదల చేశాడు. అల్లా విడుదల చేసిన ఆ దేవతల్ని విడుదల చేశాడు, వారిని లక్ష్మిదేవితో కలిసి క్షీరసాగరానికి తీసుకువెళ్లాడు. ఆ దేవతలు చాలా కాలం అక్కడనే వుండిపోయారు.
దేవతలు బలి ఖైదు నుంచి విడుదల పొంది లక్ష్మితో క్షీరసాగరానికి చేరి పొందిన ఆనంద దినాలకి స్మారకంగా ఈ పండుగ ఏర్పడింది. -ఈ పండుగ లక్షికి అత్యంత ప్రీతికరమైనది. కావుననే దీపావళి పర్వ సందర్భంలో లక్ష్మిపూజ ప్రధానకార్యమై వుంటుంది.

మహారాష్ట్ర దేశంలో హిందువుల పండగలలో ఇది అత్యంత ముఖ్యమైనది. గొప్ప వారు, పేదవారు, అన్ని వర్గాలవారు ఎక్కువ సంతోషంతో చేసుకునే పండుగ ఇది. ఇళ్లకు వెల్లకొట్టి ఈ పండుగరోజుల్లో ఇళ్లు అన్నీ దీపాలతో కలకలలాడుతూ వుంటాయి.
ఆ సంవత్సరం పెళ్లి అయిన కొత్త అల్లుళ్ళను హిందువులు ఈ పండక్కి తప్పకుండా ఆహ్వానిస్తారు. ఆ సందర్భంలో ఆ అల్లుడికి విశేష గౌరవం చేస్తారు. అతన్ని ప్రత్యేకం వాహనం మిూద తీసుకువస్తారు. అతని రాకకు సంతోష సూచనగా బాణాసంచాకాలుస్తారు.
భోజన సమయంలో అతనికి కొత్తపీతాంబరాలు ఇచ్చి గౌరవిస్తారు. మామ పంక్తినిమామ ప్రక్కను కూర్చోపెడతారు. రకరకాల పిండివంటలు అతనికి వడ్డిస్తారు.
తొలినాడు చతుర్దశి. ఈ పండుగకు నరకచతుర్దశి అనిపేరు. విష్ణువు నరకాసురుణ్ణి సంహరించింది ఈనాడే ఈ పండుగ ఆ మహత్కార్యానికి స్మారకచిహ్నము. ఈనాడు అందరూ బాగా తెల్లవారగట్లే లేచి ఇంటినిండా దీపాలు పెడతారు.
ఇంతలో ఆ యింటినౌకరులు వచ్చి ఆముదపు ఆకులు,రెండు మూడు రకాల కూరగాయలు చుట్టపెట్టి ఆపాట్లాన్ని తమయజమాని యొక్క, అతని బిడ్డల యొక్క తలల చుటూ మూడుసారులు దిగతుడుస్తారు. దిగతుడుస్తూ వారు ఇట్లా అంటారు. "అన్ని బాధలు, అన్ని పీడలు పరిహారం ఐపోవునుగాక! బలిరాజ్యం వచ్చును గాక"
నౌకరులు ఈ మాదిరిగా దిగతుడుపు, దీవెన చేసిన తరువాత ఇంటిలో అందరూ వంటికి వాసన నూనె రాసుకొని ఇంటి ముంగిలిలో వేడినీళ్లతో తలంటి పోసుకుంటారు.
పిలల దివిటీలు
తెలుగుదేశంలో దీపావళినాడు సాయంత్రం ప్రదోష కాలంలో పిల్లలు దివిటీలు కొట్టే ఆచారం ఉంది. ఈ ఆచారం పితృదేవతలకు వెలుగుచూపించే నిమిత్తం వేసే కాగడాల కరణీయ విధానం నుండే పుట్టుకువచ్చినట్లు ఊహించాలి.
ఈ దివిటీలు కొట్టడానికి తెనుగు వారు ప్రాయకంగా గోగుదుత్తలు, గోగుకర్రలు కాని చెరకు కర్రలు కాని, ఆముదపు కర్రలు గాని ఉపయోగిస్తారు. నూనెలో గుడ్డ వత్తులు నానబెట్టి ఉంచుతారు. చిగుళు తెంపని గోగుకొమ్మలు తెచ్చివాని చివర పంగల్లో ఈ వత్తులు వేళ్లాడేటట్ల కడతారు. గోవులు యింటికి వచ్చేవేళ ఈ వత్తులు వెలిగించి ఆ వత్తులు బాగా వెలుగుతూ ఉండగ వీధి వాకిటిలో కొడతారు. పెళ్లికాని ఆడపిల్లలు, వడుగు కాని మగపిల్లలు చిన్నవాళ్లు మాత్రమే ఈ ప్రక్రియ జరుపుతారు. ఆ దివిటీలు కొట్టేటప్పడు
దుబ్బూ దుబ్బూ బీపావళీ
మళ్లీ వచ్చే నాగుల చవితి
ఫుట్టవిూద పాట్ట కర్ర
పట్టకురా బావమరిది
అనే పాట పాడుతారు. ఈ పాట పాడుతూ వాటిని కొట్టి ఒక వారగా పారేసి వచ్చి కాళు చేతులు కడుగుకొని తీపి పదార్థం తింటారు.
జొన్నకర్ర అప్పటికి పొట్ట మీద ఉంటుంది.
దీపావళినాటి రాత్రి
ఈ పూజను గుజరాతీలు, మార్వాడీలు మహనీయంగా చేస్తారు. లక్ష్మీపూజ వలన రెండు విధాలైన లాభాలు . పూజించడం వల్ల అది వరకే ఆ యింట ఉన్న లక్ష్మి తొలగిపోక స్థిరంగా ఉండిపోతుంది. కొత్త లక్ష్మిన్నీ వస్తుంది. లక్ష్మి రాకను కోరే ఈ పర సందర్భంలో గృహాలంకరణము మున్నగునవి విరివిగాను, విశేషంగానూ సాగుతుంటాయి.
లక్ష్మీదేవి ఈనాడు భూలోకానికి దిగివచ్చి ఇల్లిల్ల తిరుగుతుందని శుభ్రంగా ఉన్న ఇళ్లలో తన కళను ఉంచి పోతుందనీ భారతీయుల నమ్మిక, అందుచేతనే భారత స్త్రీలు ఈ పండుగకు తమ ఇళ్లను శుభ్రం చేస్తారు. పగిలిపోయిన, పనికిరాని వస్తువులను తీసిపారేస్తారు. లక్ష్మీ విగ్రహానికి పూజ చేస్తారు. ఆమె విగ్రహం ముందు తమ ఇంట్లో ఉన్న బంగారపు వస్తువులు నగలు నాణేలు ఉంచుతారు.
బొంబాయికి ఉత్తరప్రాంతంలో అనగా గుజరాతు, రాజస్థానం ప్రాంతాల్లో ఆడపిల్లలు ఈనాడు చిత్రమైన ఉత్సవం ఒకటి చేస్తారు. వారు గుమికూడుతారు. ఆవు విగ్రహాన్ని కాని, ఎద్దు విగ్రహాన్ని కాని ఊరేగిస్తూ నది వద్దకో, చెఱువు వద్దకో వెళతారు. శ్రీకృష్ణుడు కాచిన గోవుల మందకు ఇది చిహ్నము. అక్కడ ఆ విగ్రహానికి స్నానం చేయిస్తారు. ఆ పిమ్మట పూజ చేస్తారు, పాటలు పాడతారు. అలనాడు శ్రీకృష్ణుని చెంత నాట్యం చేసిన గొల్లపడుచులను అనుకరిస్తూ నాట్యం చేస్తారు.
లక్ష్మీనిస్పరణం లక్ష్మి పూజ చేసిన పిమ్మట ఆనాటి రాత్రి ఇక నిద్రపోకూడదు. జూదము మొదలయిన క్రీడలలో పర్యాప్తులై మేలుకొని ఉండాలి.
ఇటు పూజ జరిగింది కాబట్టి లక్ష్మీ ప్రసన్నురాలై ఇంటిలో ప్రవేశిస్తుంది. లక్ష్మి ప్రవేశించిన ఇంటిలో అలక్ష్మికి స్థానం లేదు. కాబట్టి అక్కడ నుండి అలక్ష్మి తొలగిపోతుంది. అర్థరాత్రివేళ అలక్ష్మి తొలగిపోతుంది. అందుచేత ఆమెను వెళ్లగొట్టడానికి కొంత ప్రయత్నం సాగించాలి. నిశీథమందు జనులు నిద్రార్థలోచనులు కాగా నగరనారులు చేట మిూద పుల్లలతో కొడుతూ, డిండిమమనే ఢక్కావాద్యాన్ని వాయిస్తూ అలక్ష్మిని నగర వీధుల గుండా పోద్రోలాలని భవిష్య పురాణం చెబుతూ ఉంది.
-
వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు? -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!











Click it and Unblock the Notifications