వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

31న చంద్రగ్రహణం: ఆహారం ఎందుకు తీసుకోవద్దు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Super Blue Blood Moon : సూపర్ మూన్, బ్లూ మూన్, బ్లడ్ మూన్ ఒక్కసారే !

చంద్రగ్రహణం పట్టినప్పుడు ఆహారం తీసుకోకూడదని జ్యోతిష్కులు చెబుతుంటారు. అలా తీసుకుంటే మన వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుందని అంటారు. చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తాడని శాస్త్రం చెబుతుంది. ఆ పరిభ్రమణానికి 28 రోజులు పడుతుంది.

ఆ 28 రోజుల్లో ఏమి జరుగుతుందో అది కేవలం రెండు మూడు గంటల్లోనే సూక్ష్మ రూపంలో జరుగుతుందని అంటారు. శక్తిపరంగా చూస్తే భూమి శక్తి ఈ గ్రహణాన్ని ఒక పూర్తి చంద్ర పరిభ్రమణంగా భ్రమ పడుతుందని జ్యోతిష్కుల అభిప్రాయంయ. దీనివల్ల భూమిపై కచ్చితమైన కొన్ని మార్పులు ఏర్పడుతాయి.

 అలాంటి స్థితిలో పాడవుతుందట

అలాంటి స్థితిలో పాడవుతుందట

గ్రహణం సమయంలో ఏదైనా పదార్థం తన సహజ స్థితిలో లేకుంటేత్వరగా పాడిపోతుందని అంటున్నారు. పచ్చి కూరగాయలు, పండ్లలో మాత్రం మార్పు ఉండదట. కానీ వండిన ఆహార పదార్థాల్లో మాత్రం గ్రహాణానికి ముందు ఆ తర్వాత కచ్చితమైన మార్పు ఉంటుందని చెబుతున్నారు. దానివల్ల పౌష్టికమైన ఆహారమే విషంగా మారుతుందని అంటున్నారు. ఎరుకను తగ్గించేదే విషమని విశ్లేషిస్తున్నారు.

 ఎరుకను తగ్గిస్తే ఇలా...

ఎరుకను తగ్గిస్తే ఇలా...

గ్రహణ సమయంలో భోజనం చేయడం వల్ల ఎరుకను కొంత తగ్గిస్తే అది మీలో చురుకుదనాన్ని తగ్గిస్తుందట. మరికాస్తా తగ్గిస్తే నిద్రపోతారట. పూర్తిగా ఎరుకను తగ్గిస్తే మరింత ప్రమాదమని అంటున్నారు. ఇది పరిణామక్రమమేనని కూడా చెబుతున్నారు. వండిన ఆహారం ఓ సాధారమైన రోజులో కన్నా గ్రహణం పట్టినప్పుడు క్షీణించే దశల గుండా వేగంగా వెళ్తుందని అంటున్నారు.

ఆహారం తీసుకుంటే ఇలా అవుతుందట..

ఆహారం తీసుకుంటే ఇలా అవుతుందట..

చంద్రగ్రహణ సమయంలో ఆహారం మీ శరీరంలో ఉంటే రెండు గంటల సమయంలోనే మీ శక్తుల ప్రకారం దాదాపు ఇరవై ఎనిమిది రోజులు అయిపోతుందని అంటున్నారు. వండని ఆహారం కూడా తీసుకూడదని చెబుతున్నారు. ఎందుకంటే, ఆహారం శరీరంలోకి వెళ్లగానే మీ జీర్ణాశయంలోని రసాలు దానిపై దాడి చేసి, చంపేస్తాయని అంటున్నారు. దానివల్ల అది సగం వండిన ఆహారంగా మారిపోతుందట. దానిపై కూడా అదే ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.

మనిషిపై ఇలా ప్రభావం

మనిషిపై ఇలా ప్రభావం

చంద్ర పరిభ్రమణం మానవ వ్యవస్థ మీద శారీరకంగా, మానసికంగా, శక్తిపరంగా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. గ్రహణ సమయంలో అందరి శరీరాల్లో కూడా ఒక రకమైన గందరగోళం ఏర్పడుతుందట.. శరీరం గందరరగోళంలో ఉన్నప్పుడు దాన్ని ఎంత ఖాళీగా ఉంచగలిగితే అతం ఖాళీగా, ఎంత అచేతనంగా ఉంచగలిగితే అంత అచేతనంగా ఉంచడం మంచిదని చెబుతున్నారు. స్పృహతో ఉండడానికి గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకపోవడం మంచిదని చెబుతున్నారు.

శాస్త్ర ప్రకారం చూస్తే మాత్రం...

శాస్త్ర ప్రకారం చూస్తే మాత్రం...

అయితే, అవి విశ్వాసాలు మాత్రమేనని హేతువాదులు చెబుతున్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా చెబుతారు. సాధారణంగా చంద్రునికి, సూర్యునికి మధ్య భూమి వచ్చినప్పుడు సూర్యకాంతి చంద్రునిపై పడకుడా భూమి అడ్డుకుంటుంది. దానివల్ల భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. దాన్నే చంద్రగ్రహణం అంటారు.

ఈ పరిస్థితుల్లో చంద్రగ్రహణ

ఈ పరిస్థితుల్లో చంద్రగ్రహణ

చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళరేఖలో ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడికి, సూర్యుడికి మధ్య భూమి ఉండాలి. నిండు పున్నమి రాత్రి అయి ఉండాలి. చంద్రగ్రహణం కాలం చంద్రుడి స్థానకక్ష్య బిందువులపై ఆధారపడి ఉంటుంది.

ఇది వరకు

ఇది వరకు

ఇది వరకు 2008 ఫిబ్రవరి 21వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. 2011 డిసెంబర్ 10వ తేదీన కూడా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. 2015 ఏప్రిల్ 4వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. మళ్లీ రేపు అంటే జనవరి 31వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతోంది.

English summary
Astrologers say food will not be taken at the time Lunar eclipse, Why?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X