చికెన్ మునక్కాయ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా..? టేస్ట్ అద్దిరిపోద్ది అంతే..!

చికెన్ అనగానే చాలా మందికి నోరూరుతుంది. చికెన్ తో చాలా మంది చాలా వెరైటీస్ చేసుకుంటారు. చికెన్ తో ఫ్రై, గ్రేవీ, పచ్చడి, బిర్యానీ ఇలా అనేక రకాల వంటలు చేసుకుంటారు. అయితే చికెన్ మునక్కాయ కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారా..? టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. చికెన్ మునక్కాయ కర్రీని తయారు చేసుకోవడం కూడా ఈజీనే.. ఇంట్లోని తక్కువ పదార్థాలతోనే ఈ కర్రీని ఎంచక్కా తయారు చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ చికెన్ మునక్కాయ కర్రీని ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?

చికెన్ మునక్కాయ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే ముందుగా చికెన్ 500 గ్రాములు, మునక్కాయలు రెండు, ఉల్లిపాయలు రెండు, టమాటోలు రెండు, అల్లం- వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ లు, కారం 2-3 స్పూన్ లు రుచికి సరిపడా, పసుపు అర టీ స్పూన్, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా అర టేబుల్ స్పూన్, నూనె మూడు నుంచి నాలుగు స్పూన్ లు, ఉప్పు తగినంత, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తి మీర కొద్దిగా తీసుకోవాలి.

Chicken and Drumstick Curry Recipe Easy Ingredients and Simple Method to Prepare at Home Chicken

ఇక చికెన్ మునక్కాయ కర్రీ తయారీ విధానం చూస్తే ముందుగా చికెన్ ను పసుపు, కారం, ఉప్పుతో 20 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసి అందులో కరివేపాకు, ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత టమాటో ముక్కలు వేసి మెత్తగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్, మునక్కాయ ముక్కలు వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమంలో ధనియాల పొడి, నీళ్లు పోసి మూత పెట్టాలి. ఇప్పుడు చికెన్, మునక్కాయలు మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసి దించుకోవాలి. అంతే సూపర్ టేస్టీ చికెన్ మునక్కాయ కర్రీ రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+