నెతన్యాహు నరమేధం: 31 మంది మృతి, హమాస్ కొత్త చీఫ్ ఖతం

పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు మళ్లీ ఉగ్రరూపం దాల్చాయి. తాత్కాలిక కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ఒప్పందాలను ఇరుపక్షాలూ తుంగలో తొక్కడంతో యుద్ధం మరింత భీకరంగా మారింది. ఒకవైపు గాజాలో హమాస్ అగ్రనాయకత్వాన్ని సమూలంగా తుడిచిపెడుతూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) చారిత్రాత్మక విజయం సాధించగా.. మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ఒక్కరోజే 31 మంది ప్రాణాలు కోల్పోగా, పశ్చిమాసియా అంతటా హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

హమాస్ కొత్త చీఫ్ 'ముహమ్మద్ ఒడే’ ఖతం!

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సంయుక్తంగా ఇచ్చిన అత్యంత రహస్య ఆదేశాలతో ఐడీఎఫ్ గాజాలో ఒక భారీ వేటను విజయవంతం చేసింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన మారణకాండకు అత్యంత కీలక సూత్రధారి, హమాస్ గూఢచార విభాగం మాజీ అధిపతి అయిన 'ముహమ్మద్ ఒడే’ను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టింది. ఇటీవలే ఐడీఎఫ్ దాడిలో హతమైన ఎజ్జెడిన్ అల్-హద్దాద్ స్థానంలో.. కేవలం వారం క్రితమే ముహమ్మద్ ఒడే హమాస్ సైనిక విభాగానికి కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. బాధ్యతలు చేపట్టిన వారానికే ఇజ్రాయెల్ ఇతడిని అంతం చేయడం హమాస్‌కు కోలుకోలేని దెబ్బ. మే 27, 2026న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.

Israel-Hamas War Netanyahu Eliminates Hamas Chief Muhammad Odeh 31 Dead In Heavy Strikes On Lebanon

"అక్టోబర్ 7 మారణకాండకు కారణమైన ప్రతి ఒక్కరినీ వేటాడి వేటాడి చంపుతాం. హమాస్ కొత్త సైనిక చీఫ్ ముహమ్మద్ ఒడే అంతం కేవలం ఒక ఆరంభం మాత్రమే. మా పౌరులను, సైనికులను చంపిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు" అని నెతన్యాహు ఎక్స్ (ట్విటర్) వేదికగా హెచ్చరించారు.

సీజ్‌ఫైర్ బ్రేక్.. లెబనాన్‌పై క్షిపణుల వర్షం!

మరోవైపు, హిజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ.. ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌పై తన దాడులను మునుపెన్నడూ లేనంతగా తీవ్రం చేసింది. నిన్నటి నుంచి ఇజ్రాయెల్ తన గ్రౌండ్ ఆపరేషన్లను (భూతల దాడులను) విస్తృతం చేయడంతో పాటు వైమానిక దాడులతో లెబనాన్‌ను వణికించింది. టైర్ జిల్లాలోని బుర్జ్ రహల్, కవథరియాత్ అల్-రుజ్, శ్రీఫా పట్టణాలపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు బాంబుల వర్షం కురిపించాయి. మర్జయౌన్ జిల్లాలోని అస్-సవానా, ఖబ్రిఖా ప్రాంతాలు కూడా ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఒక్క ఫోన్ కాల్ తో మారిన యుద్ధం: UAE కోసం నెతన్యాహు సంచలన నిర్ణయం
ఒక్క ఫోన్ కాల్ తో మారిన యుద్ధం: UAE కోసం నెతన్యాహు సంచలన నిర్ణయం

నరమేధం: 31 మంది మృతి.. నలుగురు చిన్నారులు బలి

అంతర్జాతీయ మీడియా 'అల్ జజీరా’ నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్ జరిపిన ఈ తాజా వైమానిక దాడుల్లో కనీసం 31 మంది మరణించగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు అమాయక చిన్నారులతో పాటు ముగ్గురు మహిళలు ఉన్నట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేవలం టైర్ సమీపంలోని బుర్జ్ అల్-షమాలి ప్రాంతంలోనే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లా శ్రేణులు సదరన్ లెబనాన్‌లోని 'జావ్తార్ అల్-షర్కియా’ పట్టణంలోకి దూసుకొస్తున్న ఇజ్రాయెల్ ట్యాంకులను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

స్వచ్ఛమైన యురేనియాన్ని వదిలేసుకున్న ఇరాన్.. న్యూక్లియర్ డస్ట్ కథ ముగిసిందా?
స్వచ్ఛమైన యురేనియాన్ని వదిలేసుకున్న ఇరాన్.. న్యూక్లియర్ డస్ట్ కథ ముగిసిందా?

అమెరికా గ్రీన్ సిగ్నల్.. మరింత కఠినంగా నెతన్యాహు!

లెబనాన్ సరిహద్దుల్లో డ్రోన్ దాడులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో.. హిజ్బుల్లాను పూర్తిగా అణచివేయడానికి ఇజ్రాయెల్ చేపట్టే పెద్ద ఆపరేషన్లకు అమెరికా (వాషింగ్టన్) కూడా అంతర్గతంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అంతర్జాతీయ దౌత్య వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రధాని నెతన్యాహు తన సైన్యానికి మరింత కఠినంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

ఇటీవలి వారాల్లోనే తమ సైన్యం 600 మందికి పైగా హిజ్బుల్లా ఉగ్రవాదులను హతమార్చిందని, తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, శత్రువును పూర్తిగా తుడిచిపెట్టే దాకా ఈ పోరు సాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని వీడియో ప్రకటన ద్వారా స్పష్టం చేయడంతో పశ్చిమాసియాలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని యుద్ధ భయాందోళనలు నెలకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+