వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందా? జ్యోతిష్య శాస్త్ర అంచనాలు ఏం చెప్తున్నాయి!!
భారతదేశంలో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. త్వరలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సన్నాహాలను మొదలుపెట్టాయి. అయితే ఈసారి ఎన్నికలలో బిజెపి విజయం సాధిస్తుందా? ఎన్డీఏ కూటమికి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వస్తుందా? నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని పీఠాన్ని అధిష్టిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే బిజెపి జాతకం ఏం చెప్తుంది? బిజెపికి ఈ ఎన్నికలు ఏవిధంగా ఉండబోతుంది? అనే జ్యోతిష్య శాస్త్ర అంచనాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. బిజెపి ఏప్రిల్ 6వ తేదీన 1980 సంవత్సరంలో ఉదయం 11 గంటల 45 నిమిషాలకు ఢిల్లీలో స్థాపించబడింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు బిజెపి జాతకాన్ని చూసినట్లయితే బిజెపి పార్టీని స్థాపించినప్పటి రాశి గ్రహ బలాలను బట్టి దీనికి ఓటమిని తారుమారు చేయగల సామర్థ్యం ఉందని చెబుతారు.

ప్రస్తుతం ఈ ఎన్నికలలో కూడా బిజెపికి చాలా అనుకూలమైన అమరికలు ఉన్నాయని చెబుతున్నారు. బిజెపి జాతకంలో జన్మ చార్ట్ లో లగ్నం మరియు వారసుడు ఇద్దరు నాలుగో ఇంట్లో ఉండడంతో మతపరమైన వ్యవహారాలతో పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. అనేక మతపరమైన వ్యవహారాల కారణంగా బిజెపికి ప్రజల్లో గణనీయమైన ఆదరణ పెరిగిందని జ్యోతిష్య శాస్త్ర అంచనాలు చెప్తున్నాయి.
అయోధ్య రామ మందిరం నిర్మాణం వంటి అంశాలు ఈ ఎన్నికలలో కూడా బిజెపి ఉపయోగించుకునే అవకాశం ఉందని, ఫలితంగా బిజెపి మరోమారు అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉందని అంచనా. ఫిబ్రవరి 16వ తేదీన బిజెపికి చంద్రుని యొక్క ప్రధాన కాలంలో బుధుడు ఉపకారానికి ప్రవేశించడంతో గజకేసరి యోగం ఏర్పడింది.
ఈ యోగం ప్రభావం కారణంగా రాజకీయరంగంలో పార్టీ విజయానికి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. బిజెపి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందని, గెలుపు కోసం బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశం ఉందని, ప్రజలలో గణనీయమైన ఆదరణ బిజెపి పొందే అవకాశం ఉందని చెబుతోంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications