త్వరలో బుధాదిత్య, చంద్ర మంగళ యోగాలతో ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం కొన్ని శుభయోగాలను కలిగిస్తుంది. సెప్టెంబర్ 24, 25, 26 తేదీలలో బుధాదిత్య, చంద్రమంగళ యోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి. కన్యరాశిలో బుధుడు సూర్యుడితో కలవడం వల్ల బుధాదిత్య యోగం, తులా రాశిలో కుజుడు చంద్రుడితో కలయిక వల్ల చంద్రమంగళ యోగం ఏర్పడుతున్నాయి. ఈ రెండు మహాయోగాలు మూడురోజుల పాటు కలిసి రావడం వల్ల సంపద వృద్ధికి రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయి.
మిధున రాశి
మిధున రాశిలో నాలుగు, ఐదు స్థానాల్లో బుధాదిత్య, చంద్రమంగళ యోగాలు ఏర్పడతాయి. దీనివల్ల వీరికి ఆర్థికంగా కలిసొస్తుంది .లక్ష్మీ కటాక్షం ఉంటుంది. వివిధ మార్గాల ద్వారా వీరికి ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. భూములు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశిలో మూడు, నాలుగు స్థానాలలో బుధాదిత్య, చంద్రమంగళ యోగాలు ఏర్పడతాయి. ఇది అనేక మార్గాలలో ఆదాయ వృద్ధికి దారి తీస్తుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమై, లాభం కలుగుతుంది. గృహ మరియు వాహన యోగాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. షేర్లు, ఊహాజనిత పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు అంచనాలకు మించి లాభాలను ఇస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ సమయం అన్ని విధాల మంచి సమయం.
కన్యారాశి
కన్యా రాశి లోని బుధాదిత్య రాజయోగం, ధన స్థానంలో చంద్రమంగళ యోగం ఏర్పడడం వల్ల ఈ రాశి వారికి అన్ని పనులలోను విజయం చేకూరుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎప్పటినుంచో వసూలు కావలసిన మొండి బాకీలు వసూలు అవుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఇది కన్య రాశి జాతకులకు మంచి సమయం. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశిలో దశమ, లాభ స్థానాలలో బుధాదిత్య, చంద్రమంగళ యోగాలు ఏర్పడడం వల్ల ఈ రాశి జాతకులు సంతోషంగా జీవిస్తారు. ధనుస్సు రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులు వస్తాయి. శాలరీ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. షేర్లలో పెట్టుబడి లాభాలను ఇస్తుంది. సొంతింటి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక సమస్యలు తీరుతాయి.
మకర రాశి
మకర రాశిలో భాగ్య మరియు దశమ స్థానాలలో బుధాదిత్య చంద్రమంగళ యోగాలు ఏర్పడడం వల్ల వీరికి అనేక మార్గాలలో డబ్బు వస్తుంది. రావలసిన బాకీలు పూర్తిగా వసూలవుతాయి. మకర రాశి వారి ఆదాయం బాగా అభివృద్ధి చెందుతుంది. ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయి. సొంతిల్లు సమకూరుతుంది. తల్లిదండ్రుల వైపు నుంచి ఆస్తి లభిస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి కూడా బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో రాబడి పెరుగుతుంది.
కుంభరాశి
కుంభరాశిలో అష్టమ, భాగ్య స్థానాలలో బుధాదిత్య చంద్రమంగళ యోగాలు ఏర్పడతాయి. దీంతో వీరికి అనేక మార్గాల నుంచి ఆదాయం వస్తుంది. ఈ సమయంలో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తి లాభం, భూముల లాభం చేకూరుతుంది. ఉద్యోగంలో వేతనాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. పెట్టుబడుల ద్వారా అంచనాలకు మించిన లాభాలు వచ్చే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications