దీపావళికి ముందు శనిదేవుడు వీరికి సిరిసంపదల వరమిచ్చాడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. శని దేవుడు న్యాయ దేవుడు. కర్మలకు అధిపతి. క్రమశిక్షణతో ఉన్నవారికి శని దేవుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అటువంటి శని దేవుడు అక్టోబర్ మూడవ తేదీన గురువు నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రం లోకి ప్రవేశించబోతున్నాడు.
బృహస్పతి నక్షత్రంలోకి శనిదేవుడు
బృహస్పతి నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం లోకి శనిదేవుని సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. దీపావళికి ముందు శని దేవుడు సంచారం కారణంగా అక్టోబర్ మూడవ తేదీ నుంచి అదృష్టవంతులు అయ్యే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కర్కాటక రాశి
పూర్వభద్ర నక్షత్రం లోకి శని సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి ఈ సమయంలో కర్కాటక రాశి వారు ప్రతి పనిలోనూ అపారమైన విజయాలను సాధిస్తారు ఈ రాశులు శని తొమ్మిదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ రాశి వారు అదృష్టవంతులు అవుతున్నారు ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఇది కర్కాటక రాశి జాతకులకు అదృష్టాన్ని ఇచ్చే సమయం.
కుంభరాశి
కుంభ రాశి వారికి శని నక్షత్రం మార్పు సానుకూల ఫలితాలను ఇస్తుంది. పూర్వాభాద్ర నక్షత్రం లో శని సంచారం కారణంగా కుంభరాశి జాతకులు అదృష్టవంతులు అవుతున్నారు. మీలో మంచి మార్పులు వస్తాయి. ప్రజలలో మీకు ప్రజాధరణ పెరుగుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులను నివారించడం అవసరం. ఆర్థిక సమస్యలను నివారించడానికి తెలివిగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో కుంభరాశి జాతకులు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
మీన రాశి
పూర్వాభాద్ర నక్షత్రంలో శని సంచారం కారణంగా మీనరాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో మీన రాశి జాతకులు ఏ పని చేసిన సానుకూల ఫలితాలు వస్తాయి. మీన రాశిలో శని లగ్న గృహంలో ఉండడంవల్ల ఉద్యోగ వ్యాపారాలలో ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో మీ పని ప్రశంసించబడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయం, పరిపాలన వంటి వివిధ రంగాలకు సంబంధించిన వారు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలు చేసేవారు రెండింటిలోనూ విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీరు అనేక రంగాలలో రాణిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications