బృహస్పతి దయతో అప్పటినుండి ఈ రాశులవారికి అదృష్టం తలుపు తడుతుంది!
దేవతలకు గురువైన బృహస్పతి కి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది బృహస్పతి అంటే బృహత్ లకు ప్రభువు అని అర్థం. జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, ఆధ్యాత్మికతకు, సంపదకు, సంతానానికి కారకుడిగా చెప్పే బృహస్పతి అందరి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. నవగ్రహాలలో ఒక ముఖ్య గ్రహంగా బృహస్పతి పరిగణించబడుతుంది. గురువారం బృహస్పతికి అంకితం చేయబడిన రోజు. జాతకంలో బృహస్పతి బలంగా ఉంటే శ్రేయస్సు లభిస్తుందని, వివాహం జరుగుతుందని, సంపదలు కలుగుతాయని నమ్ముతారు.
అక్టోబర్ మాసంలో గురు సంచారం..అదృష్టం తలుపు తట్టబోయే రాశులు
అటువంటి బృహస్పతి అక్టోబర్ మాసంలో రెండుసార్లు సంచారం చేసి కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం మిధున రాశిలో ఉన్న బృహస్పతి కార్తీక త్రయోదశి తిధిన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అటువంటి చంద్రుడి రాశిలోకి బృహస్పతి సంచారం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని ఇస్తుంది. అదృష్టం తలుపు తట్టబోయే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
అక్టోబర్ మాసంలో బృహస్పతి సంచారం కారణంగా మిధున రాశి జాతకులు అదృష్టవంతులు అవుతున్నారు. మిధున రాశి వారికి ఈ సమయంలో ఏ పని చేసినా మంచి ఫలితం ఉంటుంది. కొత్త పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. మిధున రాశి వారికి శారీరకంగా, మానసికంగా ఉన్న సమస్యలు తగ్గుతాయి. మిధున రాశి వారికి ధన లాభం కలుగుతుంది. ఎప్పటినుంచో పూర్తికాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి.
వృశ్చిక రాశి
అక్టోబర్ మాసంలో బృహస్పతి సంచారం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి జాతకులు సంతానం విషయంలో, ధనం విషయంలో సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వీరు సుఖసంతోషాలతో జీవిస్తారు. వీరికి శ్రేయస్సు పెరుగుతుంది. జీవితంలో ఉన్న ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ఇది వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే సమయం.
మీనరాశి
అక్టోబర్ మాసంలో బృహస్పతి సంచారం కారణంగా మీనరాశి జాతకులు మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో విజయాలు సాధించే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా లాభాలు కనిపిస్తాయి. పెళ్ళికాని వారికి వివాహ యోగం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఇది మీన రాశి వారికి అన్ని విధాల శుభ ఫలితాలను ఇచ్చే సమయం.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications