ఈ రాశులవారు నవ పంచమ రాజయోగంతో కోటీశ్వరులవుతారు!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయి. కొన్ని యోగాలు శుభ యోగాలు కాగా మరికొన్ని యోగాలు అశుభ యోగాలు. అయితే ఏప్రిల్ మాసంలో 14 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన రాజయోగం ఏర్పడబోతోంది. కర్కాటక రాశిలో ఏప్రిల్ 20వ తేదీన నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది.
నవపంచమ రాజయోగం
కుజుడు, వరుణుడు నవ పంచమ స్థానాలలో ఉన్నప్పుడు నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగంతో దరిద్రాన్ని అనుభవిస్తున్న వారి జీవితం మారి కోటీశ్వరులు అయ్యే యోగం ఉంటుంది. నవ పంచమ రాజయోగంతో అదృష్టాన్ని పొందే ఆ రాశులను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

కర్కాటకరాశి
నవ పంచమ రాజయోగంతో కర్కాటక రాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. కర్కాటక రాశి జాతకులు అన్ని రంగాలలో విజయం సాధించడమే కాకుండా ఆర్థిక లాభాలను కూడా పొందుతారు. కర్కాటక రాశి వారికి ఉద్యోగాలలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు ఈ సమయంలో తెరుచుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కర్కాటక రాశి వారికి ఇది అన్ని విధాలా శుభాలను చేకూర్చే సమయం.
తులారాశి
నవ పంచమ రాజయోగం కారణంగా తులారాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ రాజయోగం తులారాశి వారి ఆత్మ విశ్వాసాన్ని పెరిగేలా చేస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది. ఉద్యోగంలోనూ నూతన అవకాశాలకు ఆస్కారం ఉంటుంది. తులారాశి వారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. తులా రాశి వారికి నవ పంచమ యోగం మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఇది తులా రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది.
కన్యారాశి
కన్యారాశి జాతకులు నవ పంచమ రాజయోగంతో అదృష్ట జాతకులుగా మారుతున్నారు. కన్యరాశి వారు ఈ సమయంలో మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. కెరీర్లో పురోగతి ఉంటుంది. పూర్వీకుల నుండి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. కోర్టు అధికారిక వ్యవహారాలలో విజయాలు సాధించే అవకాశం ఉంది . ఇది కన్యా రాశి వారికి శుభ సమయం. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. ఇది అన్ని విధాల వీరికి లబ్ధిని చేకూరుస్తుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications