కేతువు సంచారంతో త్వరలో వీరు నక్కతోక తొక్కనున్నారు!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలు దేనికవే ప్రత్యేకమైనవి. నవగ్రహాలలో కేతువును చెడు చేసే గ్రహంగాను, క్రూర గ్రహంగాను చెబుతారు. వివిధ జాతకుల జీవితాలలో కేతువు శుభాలను కూడా చేకూరుస్తాడు. మే 18వ తేదీన కేతువు సింహరాశిలోకి సంచారం చేయనున్నాడు. సింహరాశిలో కేతువు సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఆ రాశులవారు శుభ ఫలితాలను పొందుతారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
వృషభ రాశి
2025 సంవత్సరంలో మే 18వ తేదీన కేతువు రాశి మార్పు వృషభ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో అన్ని విధాలా లబ్ధి పొందుతారు. వృషభ రాశి జాతకులు నూతన వాహనాలు, ఆస్తులను కొనుగోలు చేస్తారు. వృషభ రాశి వారికి కెరీర్ లో పురోగతి ఉంటుంది. కేతువు రాశి మార్పు వీరికి అన్ని విధాలుగా లాభాలు చేకూరుస్తుంది.

తులారాశి
తులా రాశి జాతకులకు కేతువు సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది. తులారాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కేతువు సంచారం వల్ల తులారాశి వారికి పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కెరీర్లో పురోగతి వస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ స్కీముల నుండి, ఇన్వెస్ట్మెంట్ ల నుండి లాభాలు వస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వీరు అనుకున్న పనులు పూర్తిచేస్తారు.
కర్కాటక రాశి
మే 18వ తేదీన కర్కాటక రాశి జాతకులకు కేతువు రాశి మార్పుతో కలిసి వస్తుంది. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా మంచి ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి జాతకులు ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. వచ్చే ఏడాదిన్నర కాలం ఆర్థిక లాభంతో పాటు, ఉద్యోగంలో పురోగతిని చూస్తారు. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వర్తక, వ్యాపారాలలో లాభాలు వస్తాయి. కర్కాటక రాశి జాతకులు అన్ని విధాలుగా ఈ సమయంలో విజయాలను సాధిస్తారు. ఇది వీరికి అదృష్టాన్ని ఇచ్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications