శనిపూజలో మహిళలు ఈ తప్పులు అస్సలు చెయ్యకూడదు.. చేశారో జీవితాంతం శని మీతోనే!!
శని దేవుడిని న్యాయానికి ప్రతీకగా, న్యాయ దేవుడిలా భావిస్తారు. శని దేవుడు సహనాన్ని ఇచ్చే దేవుడు. చాలామంది శనిని చాలా క్రూరమైన గ్రహంగా భావిస్తూ ఉంటారు. జాతకంలో శని ఉన్నప్పుడు ప్రతికూల ఫలితాలు మాత్రమే కలుగుతాయని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ అది తప్పు శని జాతకం లో ఉన్నప్పుడు ప్రతికూల ఫలితాలు మాత్రమే కాదు, అనుకూల ఫలితాలు కూడా కలుగుతాయి.
అయితే శని వల్ల తీవ్రమైన ప్రతికూల ఫలితాలు కలుగుతున్నప్పుడు శని దోష నివారణ కు కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి. ముఖ్యంగా మహిళలు శనిని పూజించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించబడింది. శని పూజించే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే జీవితకాలం బాధపడాల్సి వస్తుంది. జీవితంలో శనిదోషం ఉన్న మహిళలు శనిని పూజించేటప్పుడు మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తల వివరాల్లోకి వెళితే..

శనిదేవుని పూజించేటప్పుడు మహిళలు పొరపాటున కూడా శని విగ్రహాన్ని తాకకూడదు. శని దేవుడి విగ్రహాన్ని మహిళలు తాకితే వారికి ప్రతికూలమైన ప్రభావం కలుగుతుంది. ఇక శని పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా మహిళలు శని దేవుడి కళ్ళల్లోకి చూడకూడదు. అలా చూస్తే ప్రతికూలమైన ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది.
శని దేవుని విగ్రహానికి నూనెను సమర్పించటం నిషేధం. కాబట్టి శనిదేవుని విగ్రహానికి మహిళలు ఎప్పుడూ నూనెను సమర్పించ కూడదు. కానీ శనికి ముందు దీపాన్ని పెట్టొచ్చు. లేదంటే ఏదైనా రావి చెట్టు ముందు దీపాన్ని పెట్టవచ్చు. శనివారం స్త్రీలు శనికి సంబంధించిన ఆవనూనె, నల్ల బట్టలు, నల్ల ఉసిరి, నల్ల నువ్వులు వంటి వాటిని దానం చేయడం మంచిది. ఇది శని దోషాన్ని పోగొడుతుంది.
అంతే కాదు శని అనుగ్రహం పొందటానికి మహిళలు శని ఆలయంలో శని చాలీసా చదవడం కూడా ఎంతగానో లాభిస్తుంది. శని చెడును మాత్రమే మంచిని కూడా చేస్తాడు. భక్తి శ్రద్ధలతో పూజిస్తే అష్టైశ్వర్యాలను కూడా ఇస్తాడు.కాబట్టి శని విషయంలో అపోహలు మాని భక్తి శ్రద్ధలతో నియమాలను అనుసరించి శని పూజ చేసి శని దేవుడ్ని ప్రసన్నం చేసుకోవాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం! -
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications