త్వరలో యుక్త యోగం .. ఈ రాశులవారిదే అదృష్టం!!
వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల రవాణా, వివిధ గ్రహాల సంయోగం అనేక శుభ యోగాలను, అశుభ యోగాలను కలిగిస్తుంది. నవంబర్ 17వ తేదీన తెల్లవారుజామున ఒంటిగంట ఏడు నిమిషాలకు యుక్త యోగం ఏర్పడుతుంది. వృశ్చిక రాశిలో ఏర్పడే ఈ యోగం సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్న అంగారక గ్రహం తో కలిసినప్పుడు ఏర్పడుతుంది. ఈ యొక్క యోగం కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.
కర్కాటక రాశి : యుక్త యోగం వల్ల కర్కాటక రాశి వారికి బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారికి సూర్యుడు మరియు కుజుడు రెండు ప్రయోజనకరమైన గ్రహాలు కావడంతో సృజనాత్మక రంగాలలో ఉన్న వారికి గొప్ప ప్రయోజనం కలుగుతుంది. సృజనాత్మక రంగంలో ఉన్న కర్కాటక రాశి వారు మంచి గుర్తింపు పొందడానికి ఇది సరైన సమయం. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక లబ్ది, పనిలో విజయం, భౌతిక ఆనందం కలుగుతాయి.

సింహరాశి : సింహ రాశి వారికి సూర్యుడు మరియు కుజుడు కలయికతో ఏర్పడే యుక్త యోగం ప్రయోజనాలను కలిగిస్తుంది. సింహరాశి జాతకులు తమ లక్ష్యాలను సాధించడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో వీరు అనుకున్న పనుల్లో విజయాన్ని సాధించగలుగుతారు. మంచి సంపాదన ఉంటుంది. అయితే ఈ సమయంలో కాస్త ఆరోగ్యవిషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంటి వాతావరణ ప్రశాంతత విషయంలోనూ, తల్లితో సంబంధాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి సూర్యుడు మరియు కుజుడు ఇద్దరు కలిసి ఉండటం వల్ల లబ్ధి చేకూరుతుంది. వృశ్చిక రాశి వారు తమ లక్ష్యాలను సాధించాలంటే ఇది సరైన సమయమని సూచించబడింది. ఈ సమయంలో ఆరోగ్యం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వ్యక్తులతో సంబంధాలు కాస్త దెబ్బ తినే అవకాశం ఉంది. కానీ ఆర్థికంగా మాత్రం యుక్త యోగం గణనీయమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి వారికి మంచి అదృష్టం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications