జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటే....
బుధుడి సంచారం వల్ల కొన్ని రాశులవారిపై అనుకూల ప్రభావం ఉంటే మరికొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. జాతకంలో బుధుడు మంచి స్థానంలో ఉంటే ఆర్థికంగా లాభాలున్నాయి. అలాగే ప్రతికూల స్థానంలో ఉంటే నష్టాలు కలుగుతాయి. ఈనెల 27న బుధుడు ధనుస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
వీరికి సమస్యలతోపాటు లాభాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా జీవించాల్సి ఉంటుంది. వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే ఉత్తమం. డబ్బులు ఖర్చుపెట్టే క్రమంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనులు విజయవంతమవుతాయి.

వృషభ రాశి
బుధుడు ధనుస్సు రాశిలోకి సంచారం చేయడం వల్ల వృషభ రాశివారికి తీవ్ర నష్టాలు కలుగుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. భాగస్వామితో విభేదాల పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయి. ఆర్థికంగా నష్టపోతారు. నష్టపోకుండా ఉండాలంటే ఆర్థిక విషయాల పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి.
సింహ రాశి
బుధుడి సంచారం ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలనందిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. కుటుంబానికి సంబంధించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో యజమానులతో విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఎంతో ఆచి తూచి మాట్లాడటమే కాకుండా నోటిపై అదుపు ఉంచుకోవాలి. దీనివల్ల కొన్ని ప్రమాదాలను నివారించినట్లవుతుంది.












Click it and Unblock the Notifications