జ్యోతిషం: పాఠకుల సందేహాలకు జవాబులు

పాఠకులు పంపిన ప్రశ్నలకు ప్రముఖ జ్యోతిష పండితుడు మారుతి శర్మ సమాధానాలు ఇవ్వడం ప్రారంభించారు. కొందరు పాఠకుల సందేహాలను ఆయన తీర్చే ప్రయత్నం చేశారు. వరుసగా వీలు వెంబడి ఇతర పాఠకుల ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇస్తారు. ప్రశ్నలు చాలా ఉండడంతో కాస్తా ఓపిక పట్టాలని మనవి

Answers to readers questions

1. మురళీధర్‌ వివాహ పొంతన

మురళీధర్‌ గారు పంపిన మోహిత్‌ రాశి మొదలైన పొంతనలు కలిసాయి . ఇది మంచి ఉపయోగకారి. భరణి (మహతి) ఉత్తరాభాద్ర (మోహిత్‌) లకు 16 గుణాలు కలిసాయి. ఇది కొంతబలహీనము.మహతికి కుజ దోషంలేదు (9లో కుజుడు) మోహిత్‌కు 5కుజుడి మూలంగా కొంత ఇబ్బంది. మొత్తానికి పొంతన మధ్యమమగా కుదిరినది .కొన్ని దోషాలు చూడగా , దీన్ని మొదటి విలువగా కాకున్నా 2వ స్థాయిగా తీసుకోండి.

2.మనీష ఆస్ట్రేలియా సంతానం

మీజాతకం పరిశీలించాను 5వభావం సంతానం అక్కడ రాహువుండటం మూలంగా గర్భనష్టం జరిగింది, 3వ భావంనుండి శని 5వభావాన్నేచూడటం సంతానం ఆలస్యంగా జరుగుతుంది. ప్రత్యేకించి మీకిప్పుడు రాహుదశ. గోచారం ఆనుకూలంగా లేదు 2015 అక్టోబర్‌ తర్వాత మెరుగు పడుతుంది. సుబ్రహ్మణ్య పూజ, శని రాహు వులకు ఏడాదికొకసారి శాంతి చేసుకోడి.

శ్లో॥ నమోదేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమ:
పుత్రసౌఖ్యందేహిదేహి గర్భరక్షాం కురుష్వన: - ఇది ఇద్దరూ ఎక్కువసార్లు జపించండి. గర్భం నిలబడుతుంది.సుపుత్ర ప్రాప్తిరస్తు శుభం

3.సురేష్‌ (బహుష నెల్లూరు) కొడుకు పేరు

మీకు రెండుశుభవార్తలు 1.మీ కుమారుడికి ,బాలారిష్టాలు (పెద్ద జననదోషం) మరియు (నక్షత్ర దోషం) ధనిష్ట 1పాదం ఈరెండూ లేవు. ఇక పేరువిషయం (గా) అనే అక్షరంతో మొదలయ్యే సరిసంఖ్య ఇంగ్లీషులో ఈవెన్‌(2,4,6,8 లాగ) పేరు పెట్టొచ్చు లేదా కులదైవం ఇష్టదైవం పేరు ఏదైనా అక్షరాలతో సంబంధంలేకుండా పెట్టొచ్చు.

4.గోపాల్‌ రెడ్డి జూలై / 02 / 1986 నెల్లూరు

అదృష్ట రత్నం వజ్రం ఎప్పుడూ ధరించదగినది. ముత్యం,కనక పుష్యరాగం కూడా జాతకరీత్యా మంచివి.
సంకల్పయుతంగా పూజచేసి .ధరించండి.

5.అడుసుమల్లి గోపీకుమార్‌ పూరి,ఒరిస్సా జాతక వివరాలు

శ్రవణ నక్షత్రం 2వ పాదం,మకర రాశి,కుంభ లగ్నం

6.జగదీశ్‌ భీమవరం ఇంటికి సరిపోయే సింహద్వారం

మీ పేరు మొదటి అక్షరం (జ) మీభార్య నుమ ప్రియాంక పేరు మొదటి అక్షరం (స) ఇద్దరికీ తూర్పు ద్వారం సరిపోయేది.వేరే అవకాశాలున్నా ఒకరికి కలిస్తే ఇంకొకరికి కలవట్లేదు. (దక్షిణం, ఉతరం, పడమరలు, మీపేరున అస్సలు పనికిరాదు) మీజన్మ నక్షత్రాలకన్నా ఇదే శ్రేష్టం.

7.శ్రీకాంత్‌ రెడ్డి మోగుసాల ( 990 820 8326 )

వీధి గుమ్మం ఎటు పెట్టాలి. మీ పేరున తూర్పుదిక్కు మంచిది (మిగిలిన వివరాలు కావాలంటే మీనక్షత్రం చెప్పాలి.

8.కంచాల అనిల్‌ కుమార్‌ బాపట్ల ఆరోగ్యం

మీ జాతకంలో రాహుకేతువుల ప్రభావం జాతక చక్రంలోనూ, ప్రస్తుత గ్రహస్థితిలోనూ బాగాలేనందున అనారోగ్యసమస్యలు ఉన్నాయి.ఈనెల 16 తర్వాత కొంత మార్పు కలుగుతుంది. 2015 ఫిబ్రవరి తర్వాత బాగౌతుంది.రాహు కేతువులకు శాంతి పూజలు మీఇంట్లో జరుపుకోండి.

9.చంద్రశేఖర్‌ తిరుమల -ఆరోగ్యం , మరికొన్ని ప్రశ్నలు

1.చంద్ర దశతోడుగా మీ కు రాహు అంతర్దశ ఇబ్బంది పెట్టింది (జూన్‌ 2013 నుండి ఫిబ్రవరి 2014 వరకు) ఈ ప్రభావం ఉంటుంది. గోచారంలో 67 శనిమూలంగా గత రెండున్నర సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతుంది.(చంద్ర,శని,రాహు,కేతువులకు పరిహారం చేసుకోండి)

2.గురుడు ఉచ్చలో ఉన్నాడు,కానీ గజకేసరీ యోగం మీకు లేదు.(కెరియర్‌ గురించి చర్చించడానికి ఇది వేదిక కాదు )

10.రవీంద్ర ( వివరాలు ఇవ్వలేదు ) ఆర్థిక మానసిక సమస్యలు

గణపతి హోమం చేయించుకోడి.

ఉద్యోగాలు

11.గౌతమ్‌ కుమార్‌ వర్మ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి ప్రయత్నం

2015 చివర్లో మంచి ఫలితం పొందుతారు . దానికన్నా ఉన్నతికి ఆలస్యముంది .26 నవంబర్‌ 2016 లో వరకు గ్రహ దశ బాగాలేదు అప్పటి దాకా స్థిరత్వం కోసం శ్రమించాలి, పెళ్లి మీకు ప్రస్తుతం మంచికాలం, ఇదిదాటితే 201516 చివర్లో ఉంది.

12.రాజేశ్‌ తుని 3 ప్రశ్నలు (మీవివరాలు 12/9/1074 అని పంపారు 1974 అని తీసుకుని పరిశీలించాము ) వివరాలు సరిగ్గా పంపండి.

1.కంపెనీ మారటానికి మంచిసమయం మంచి ఎదుగుదల ఉంటుంది. 2.ఉన్నతవిద్య ఉన్నది
3.మీపిల్లల భవిష్యత్తు వివరాలులేకుండా చెప్పడం కష్టం.

13.మచ్చ వేంకట కృష్ణ ( ప్రొద్దుటూరు) ఉద్యోగం

201516 మధ్యలో మీకు వస్తుంది. ఎక్కువగా రుద్రాభిశేకం చేయించు కోండి.

14.ఎన్‌ .కొండారెడ్డి అనంతపురం -ఉద్యోగానికి ప్రయత్నం , 7 సంవత్సరాలుగా సమస్యలు.
కుజదశమూలంగా 7సంవత్సరాలుగా మీకు సమస్యలు, మాటవిలువ తగ్గడం, శ్రమకు తగిన ఫలితం రాదు. మార్చి 2017 వరకు ఇబ్బందులుంటాయి .ఆలయ ప్రదక్షిణలు , ఏడాదికోసారి రాహు,శని, సూర్యులకు ,పరిహారం చేసుకోండి.సమస్యలు తగ్గి ఆలోపే ఉద్యోగం పొందుతారు. శుభం.

15.నరేందర్‌ పసునూటి వరంగల్‌ విదేశాల ప్రయాణం,కుటుంబంలో ఇబ్బందులు.

1.విదేశాలకు వెళ్లే అవకాశం తక్కువగా ఉంది ( అసలే లేదని దాని అర్థంకాదు ) గ్రహబలం అనుకూల సమయాలు చాలాదాటి పోయాయి.2016 ప్రయత్నించండి.పుణ్యకార్యాలు అన్నదానాలు చేస్తూండండి.
2.రవి,చంద్ర,బుధ,రాహు,కేతు వీటి బలం వల్ల కుటుంబంలో అసంతృప్తి వెలితి నిరాశ, మాటవిలువ తగ్గడం ఉంటుంది. అసమర్థతగా అనిపించడం,వంటివి శుక్రుడి ప్రభావం వీటికి ఒకసారి శాంతి చేసుకోండి.శుక్ర,చంద్రులకు ప్రీతిగా ప్రతీవారం దానాలు చేస్తూ ఉండండి క్రమంగా మార్పొస్తుంది.

16.శ్రవణ్‌ కుమార్‌ పెండు బల్లి నెల్లూరు కంపెనీపెట్టడానికి మంచి సమయమేనా ?
జాతకరీత్యా గోచారరీత్యా కంప్యూటర్‌ వృత్తి వంటి కంపెనీలు లేదా మరేదైనా చేయడానికి మంచి కాలం.
నమ్మకం ,నష్టాల విషయాలలో అసూయాపరులవిషయాలలో జాగ్రత్తగా ఉండండి. గణపతి హోమం చేయించుకొని మొదలు పెట్టండి.

17.ఓ.శివశంకర ప్రసాద్‌ ఢల్లీి వృత్తి ,వ్యాపార ఆరంభం ?

గోచారరీత్యా గురుబలంఉన్నందున వ్యాపారం ప్రారంభించవచ్చు,ఏవ్యాపారమో రాయలేదు, ఏదైనా మీకు ప్రస్తుతం బాగుంది,అభివృద్ధి మెల్లిగా ఉంది, ఏవ్యాపారమో చెపితే భవిష్యత్తెలా ఉండేది స్పష్టంగా చెపొచ్చు.

18.రాజేష్‌ కుమ్మర హైదరాబాద్‌ ఉద్యోగం పెళ్లి

జాతకం దశ గోచారరీత్యా మీకు 2017 లోపు కానీ 2017 లో కానీ ఉద్యోగం,పెళ్లి రెండిరటికీ సరైన సమయం పుణ్యకార్యలు,గట్టి ప్రయత్నాలు అవసరం శుభ
19.వీరమల్లిశివప్రసాద్‌ కందుకూరు ( ప్రకాశం ) ఉద్యోగం కంపెనీ మారొచ్చా ?,అప్పులెప్పుడు తీరుతాయి.కొన్ని వివరాలు.

(1).2016 లో మంచికాలం ఉంది ఇప్పుడు కాస్త ఉద్యోగంలో ఓపిక పట్టండి. (2)20162017 లో అప్పులు తీరతాయి.దైవ ప్రార్థన ,బీదలకు దానాలు చేయండి.రాహువుకు శనికి పరిహారం చేసుకోండి.అప్పులు తీరడానికి గణేశ ఋణహర స్త్రోత్రం చదువుతూ ఉండండి. (3)(3,6,8 మంచి అంకెలు కనక పుష్యరాగం బంగారపు ఉంగరంతో ధరించాలి . క్రీమ్‌,నారింజ,మంచివి,నలుపు నీలం మంచివి కావు.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+