మాంగళ్య దోషం: జ్యోతిష్కుడు ఏమంటున్నారు?
1.కొండారావు, విశాఖపట్నం - స్వంత ఇల్లు
పుట్టిన సమయం రాయలేదు. నక్షత్రం కూడా రాయలేదు. దేని ఆధారంగా చెప్పాలి? ఇలాంటి వివరాలకు సమయంరాయాలి, నియమావళి చదవండి.
2.రమణి ` గుంటూరు ` వివాహం
మీకు మాంగళ్యదోషంలేదు, అసలు మాంగళ్య దోషం ఉంటే వివాహం కాదు అనేమాట అపోహ మాత్రమే, అలాంటివారికి చాలామందికి వివాహాలయ్యాయి. మీ మనసులోంచి ఆఆలోచన తీసేయండి.
3.రాజశేఖర్ .సి ` 9866237728 ` వివాహం
పుట్టిన సమయం ,చోటు రాయలేదు.నక్షత్రంకూడారాయలేదు ,దేని ఆధారంగా చెప్పాలి? ఇలాంటి వివరాలకు సమయంరాయాలి,నియమావళి చదవండి.
4. కృష్ణమురళి గొనమండ` శ్రీకాకుళం ` ఉద్యోగం
మీకిప్పుడు కొంత కష్టకాలం నడుస్తుంది ,అంతమాత్రానా అసలే ఉద్యోగం లేంటే ఎలా?శనికుజులకు శాంతి పరిహారాలు చేసుకోండి.
5. మగులూరి రవి, అనూషల సంతానం గురించి ` అద్దంకి
రవిగారికి 8వ అధిపతిశని 5లోఉన్నాడు, అనూషకు 2లో కేతువున్నాడు. ఇవి సంతాన నిరోధకాలు ఇద్దరికీ సెప్టెంబర్ తర్వాత గురుబలం వల్ల సంతానం కలుగుతుంది కాబటి ముందు శని,కేతువులకు పరిహారం చేసికొని సుబ్మ్రణ్యారాధన చేస్తూండండి.
6.గోగినేని వెంకటసుబ్రహ్మణ్యం ` తూ.గో ` సంతానం
మీజాతకంలో సంతానబలం అనుకూలతలు లేవు మీభార్యవివరాలు పంపితే నైనాఆవిడజాతకంఫ్రకారం బట్టి చెప్పవచ్చు.
7.రమేష్.కె. `
కెరియర్ `పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. నియమావళి చదివి మీప్రశ్న పంపండి.
8.రామకృష్ణ ` బిజినెస్ గురించి
మీరు పుట్టిన సమయం కానీ, నక్షత్రం కూడా రాలేదు, చెప్పడం కుదరదు.

9. తెంటు రమేష్ ` బొబ్బిలి (కెరియర్)
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. నియమావళి చదివి మీప్రశ్న పంపండి.
కృష్ణమూర్తి .పి ` సింగరాయకొండ ` (ప్రభుత్వోద్యోగం)
మీకు ప్రభుత్వోద్యోగం అవకాశం ఉంది.
10.హరిశంకర్ పవన్ ` బొబ్బిలి `ఉద్యోగం
మీకు ప్రభుత్వోద్యోగం అవకాశం ఉంది, కానీ కొంత ఆలస్యంగా ఉంది , రాహుకేతువులకు పరిహారం చేసుకోండి ,మరొక రెండేళ్లు ఆగవల్సి ఉంటుంది.
11. నల్లకిషన్ ` పులివెందుల ` వాహనం
మీరు వాహనాన్ని కొనడానికిప్పుడు మంచికాలం
12.లక్ష్మీమానస ` హైదరాబాద్ ` వివాహం
మీ జాతకంలో పాపగ్రహాల దృష్టివల్ల, కొంత సమస్యలుంటాయి కానీ మరొక సంవత్సరం ఆగవల్సి ఉంటుంది. కుజ, బుధులకు పరిహారం చేసుకోండి.
13. గీతావాణి` టెక్కలి ` కుటుంబసమస్యలు
మీ భర్తగారి జాతక కూడా ఇస్తే రెండిరటినీ పరిశీలించి చెపుతాము.
14.దత్తాత్రేయ ` ఆదిలాబాద్ ` ఉద్యోగం
మీకీసంవత్సరం తప్పక ఉద్యోగం ఉంది తప్పక ప్రయత్నించండి.
15.రామారావు ` ముమ్మిడివరం ` ఆర్థికసమస్యలు
ఏల్నాటి శనివల్ల ఈ ఆర్థిక సమస్యలుంటాయి శనికి శాంతి చేసుకోండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications