జ్యోతిష్కుడి మాట: గ్హహాలు అనుకూలంగా లేవా?
1.కట్ట శ్రీనివాసు,లక్ష్మి దంపతుల సంతాన విషయం(గోదావరి జిల్లాగా తిసుకున్నాం)
లక్ష్మీగారికి 5లో పాపగ్రహాలున్నయి. రాహువు దశ నడుస్తుంది. శ్రీనివాసుగారికి 5అధిపతి శనితో కలిసున్నాడు.శని దశ నడుస్తుంది.ఆయా గ్రహాలకు పరిహారం చేసుకోండి.సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూండండి నిజానికి ఇది అంత అనుకూల కాలం కాదు కానీ పుణ్యబలానికి దానధర్మాలుచేస్తూండండి.శుభం.
2.పివియస్ ప్రసాద్ రాజు, అమలాపురం, వివాహం, కెరియర్
వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.నియమావళి చదివి మీప్రశ్న పంపండి.
3.శిరీష సిరి
పుట్టిన సమయం, చోటు రాయలేదు అశ్విని నక్షత్రం రాసినదాని బట్టి చెపుతున్నాం. మీకు అష్టమశని 4గురుఉన్నాడు ఆగస్ట్ తర్వాత గురు బలం వసయ్తంది వివాహానుకూలత ఏర్పడుతుంది.కానీ 8వ శని వల్ల మాట విలువ తగత్గటం అనారోగ్యం శ్రమ వంటి ఇబ్బందులుంటాయి.శనికి పరిహారం చేసుకోండి.
శుభం.
4. ఖాదర్‌బాషా షేక్, విజయవాడ, భవిష్యత్తులో ఆర్థికస్థితి
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
5.రమణ ,తణుకు,ఆర్థిక ఇబ్బందులు
మీకు ఏల్నాటి శని ప్రభావంగా ఆర్థిక ఇబ్బందులొస్తాయి, నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారు, మాట విలువ తగ్గుతుంది, శ్రమకు తగిన ఫలితం రాదు. శని పరిహారం చేసుకోండి మీకు ఈశని ఇబ్బంది ఈ మధ్యనే మొదలైంది, శనికి ప్రీతిగా శాంతి పూజలు, నూనె వంటి వస్తువులు దానంచేస్తుండండి పుణ్యకార్యాలు చేయండి. ఆలోచించి మాట్లాడుతుండండి.
6. శ్రీనివాసులు పి , ఎమ్మిగనూరు
వివాహం, కెరయర్ వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

7. కెవి రామకృష్ణ, హైదరాబాదు,పోటిపరీక్షాఫలితాలు
మీకు జాతకరీత్యా 8లో శని,గురులున్నారు,దీనివల్ల కొద్దిలో ప్రయత్నాలు విఫలం అవుతాయి. గోచారంలో కేతువు మూలంగా ఆటంకాలుంటాయి. గురు, కేతువులకు దానాలు పూజలు శాంతిచేసుకొని వెళ్లండి.హయగ్రీవ జపం చేస్తూండండి.జయోస్తు.
8.సీతారాం విష్ణుమొల్కల
పుట్టిన సమయం స్పష్టంగా రాయలేదు. చోటు రాయలేదు నక్షత్రం కూడారాయలేదు. మీరు మాకు సరైన వివరాలివ్వ లేదు సమస్యకూడ తెలుగులో స్పష్టంగా అడగండి.
9. హన్మంతరావు గాదె
పుట్టినచోటురాయలేదు. హైదరాబాదుగా తీసుకుని చెపుతున్నాం. మీకు 2వభావాన్ని కుజుడు శనితో కలిసి ఉన్నాడు. మీకు 8వభావాధిపతి 7వఅధిపతి వివాహకారకుడితో ఉద్యోగాధిపతితో కలిసి ఉన్నాడు.ఇవన్నీ మీకు ఉద్యోగ వివాహసమస్యలకు కారణం. ఆగస్టుతర్వాత కొంత బాగవుతుంది. చంద్రబుధులకి దానాలు పూజలు శాంతులకు పరిహారం చేస్తూండండి.
10.అంజలి,భరత్ లసంతానంకోసం
పుట్టిన సమయం రాయలేదు, చోటు రాయలేదు నక్షత్రం కూడారాయలేదు. మీరు మాకు సరైన వివరాలివ్వలేదు .నియమావళిని చదవండి.
11. నందీష్ కోరిటాల ,మంగళగిరి
మీకు సెప్టెంబర్ తార్వత వివాహబలం ఉంది.పూర్తికెరియర్ దాంపత్యం ఎలా ఉండేది గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.
12.సునీల్ కుమార్,(మూల నక్షత్రం)
పుట్టిన సమయం రాయలేదు ,చోటురాయలేదు
పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.నియమావళి చదివి మీప్రశ్న పంపండి.
13.శివసాయి కుమార్
పుట్టిన చోటు రాయలేదు,శతభిషనక్షత్రం),చదువు
విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచుకున్న ప్రశ్న ఏమిటి `ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యల గురించి అడగదల్చుకున్నారా, ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అడగదల్చుకున్నారా? లేదా ఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి
14.కోదండరాం, తిరుపతి,భవిష్యత్తు
పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications