జ్యోతిషం: ప్రేమ పెళ్లికి అవకాశం లేదా?

1. ఇందిరా ఆనంద్‌, పూణె, ఉద్యోగం

మీకు గోచారంలో ఏలినాటి శని నడుస్తుంది, ఉద్యోగం పోవడం పైఅధికారులతో నింద వంటివి జరుగుతాయి. 2018 తర్వాత కొంత బాగుపడుతుంది. శనికి దానాలు పరిహారాలు చేస్తూండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

2. సోమిశెట్టి కుసుమ, హైదరాబాద్‌, ఉద్యోగం

2016 సెప్టెంబర్‌ తర్వాత గురుబలం వల్ల అనుకూలత వస్తుంది. కానీ అసలు మీకు పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంది. శుక్ర, రాహు, బుధులకి దానలు పరిహారాలు చేసుకోండి.

3. తిరుమల రావు, అవని గడ్డ, కెరియర్‌

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

4.షేక్‌ సైదులు, హైదరాబాద్‌, వివాహం

మీకు మాంగల్య దోషమూలేదు, కుజదోషమూలేదు, తప్పకుండా వివాహం అవుతుంది. గురుబలం బాగానే ఉంది, ప్రయత్నం చేయండి, వివాహానికి మేం ఒక మంత్రం అందించాం అది చదవండి. కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం

5. శ్రీనివాస శర్మ, ఆదిలాబాద్‌, రెండోపెళ్లి

ఇప్పటికే విడాకులయ్యాయి అంటున్నారు. రెండో పెళ్లికి అవకాశం ఉంది, కానీ అది కూడా సమస్యలతో ఉంటుంది, కాస్త జాతకాలు చూసుకోండి, తర్వాత చేసుకోండి.

6. నిమ్మగడ్డ భూపతి, హైదరాబాద్‌, విదేశగమనం

మీకు విదేశ గమనానికి అవకాశం లేదు.

7. మేడవరం విశ్వ, ఆదోని, కెరియర్‌

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

8. నారయణ రావు ఆర్‌,ఆర్‌,వి,విజయవాడ, ప్రేమపెళ్లి

మీకు జాతకం ప్రకారం ప్రేమ పెళ్లికి అవకాశంలేదు

9. కొడమంచలి జనార్దన్‌, విజయవాడ, మ్యాచింగ్‌

మ్యాచింగ్‌ కలిసింది కానీ ఇద్దరికీ సంతాన దోషం ఉంది, ఏ ఒక్కరికో ఉంటే చేయొచ్చు. కానీ ఇది పనికి రాదు.

10. శరణ్‌ నాథ్‌, హైదరాబాద్‌, కెరియర్

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయంగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు,నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

11.ఆర్‌,మాధవి, శంషాబాద్‌, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగం అవచ్చే అవకాశం ఉంది.

12. బొమ్మి శెట్టి ప్రణవి, పొద్దుటూరు, ట్రాన్స్‌ఫర్‌

ట్రాన్‌ఫర్‌ కి ఇప్పుడు గ్రహస్థితి అనుకూలంగా లేదు, శని రాహువులకి దానాలు ఎక్కువ చేయండి, తొందరపడి వదిలేయకండి.

13. భుజంగ ప్రసాద్‌, ఆర్‌.పుట్టిన చోటు రాయలేదు, లైఫ్‌ సెటిల్‌మెంట్‌

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయంగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

14. డేవిడ్‌ నవీన్‌, బెంగుళూరు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం

మీకు జాతకంలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగం, ఐటి, కన్‌ స్ట్రక్షన్‌వంటివి మీకు పనికొచ్చే రంగాలు.

15. చిన్నన్న,(చిన్న),కర్నూలు,ప్రేమపెళ్లి

మీకు జాతకం ప్రకారం ప్రేమ పెళ్లికి అవకాశంలేదు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+