మీ జ్యోతిష్కుడి జవాబు: పాపస్థితి ఉందా?

1.శ్రీకాంత్‌, సందేహం.

జ్యేష్ఠ నక్షత్రం ఉన్నఅమ్మాయినికానీ అబ్బాయికికానీ పెళ్లిచేసుకుంటే గండం అనే మాట అబద్ధం. అలాగైతే ఆనక్షత్రం ఉన్నవారికి పెళ్లేకాదా?మరొకాటి అబ్బాయికి ఆన్నయ్య ఉంటే అని అడిగారు అది అర్థంకాలేదు. కానీ ఒకమాట.

వధువు జ్యేష్ఠ పుత్రిక 1
వరుడు జ్యేష్ఠ పుత్రుడు 1
వధువు జ్యేష్ఠనక్షత్రం కలవ్యక్తి 1
వరుడు జ్యేష్ఠ్ఠనక్షత్రం కలవ్యక్తి 1
పెళ్లి జరిగేమాసం జ్యేష్ఠమాసం 1
పెళ్లి జరిగే రోజు జ్యేష్ఠ నక్షత్రమున్న రోజు 1
ఇలాంటిక్రమంలో ఏరెండైనా కలవచ్చుకానీ 3కానీ ఆపైన రాకూడదు.(జ్యేష్ఠాత్రయం త్యజేత్‌)

అమ్మాయి అబ్బాయి జ్యేష్ఠులుకావచ్చు కానీ (వధువు కానీ వరుడుకానీ జ్యేష్ఠనక్షత్రం కలవ్యక్తి కాకూడదు,పెళ్లి జరిగే మాసం జ్యేష్ఠ మాసం కాకూడదు. పెళ్లి జరిగే రోజు జ్యేష్ఠ నక్షత్రమున్న రోజు కాకూడదు)

2. రాజేష్‌ తాటికొండ, పుట్టిన చోటు రాయలేదు, హైదరాబాద్‌గా తీసుకున్నాం, వివాహం

మీకు ఎప్పుడవుతుంది అని అడిగారు కానీ మీకు జాతకంలో అడ్డంకులు కలిగించే పాపస్థితి ఉంది. 7వ అధిపతి కుజుడు,8వ అధిపతి శుక్రునితోకలిసి ఉన్నాడు, కుజదోషం ఉంది. వీటికి ముందు పరిహారం చేసుకొని ఇంద పరిహారాలలో ఇచ్చిన వివాహప్రార్థన చేస్తూండండి.

3. సుధాకర్‌ సంగయ్యగారి, తాడిపత్రి, విదేశగమనం

మీకు జాతకరీత్యా విదేశగమనానికి అవకాశం ఉంది. కానీ మీరు ప్రయ్నించేదాన్ని బట్టి ఎప్పుడో చెప్పవచ్చు అది మీరివ్వలేదు కనుక 2015ఫిబ్రవరి తర్వాత ప్రయత్నించండి.

4. మాధవి పరుచూరి, పుట్టినచోటు, సమయంరాయలేదు, భవిష్యత్తు.

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

Ask Your Astrologer: Future prospects

5. కొప్పడి రింకారాణి, పుట్టిన చోటు రాయలేదు. ప్రశ్నకూడారాయలేదు.

6. సి.హెచ్‌.నరేష్‌రావు, నిజామాబాద్‌, ఉద్యోగమా? లేక వ్యాపారమా?

మీకు ఉద్యోగం మంచిది.వ్యాపారమైతే సేల్స్‌అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ మంచిది.సేవారంగం మీకు మంచిది.

7.మురళిమారోతు, స్వంత ఇల్లు

పుట్టిన సమయం, చోట్లు రాయకుండా, ఇంటి విషయాలు చెప్పడం కుదరదు. కానీ మీ నక్షత్రాన్నిబట్టి పరిహారం చేసుకోండి.

నవగ్రహాలకి జపాలు పరిహారాలు

8.అరవ సత్యనారాయణ, సెటిల్‌మెంట్‌

మీరనుకున్నసెటల్‌మెంట్‌ నిజానికి మాకు తెలియదు, అవి చర్చించేవికానీ ఇలా సూచనలిచ్చే చిన్నవేదికలో అందించేవి కావు.పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.

9.రాకేష్‌ శర్మ, సూర్యాపేట్‌, వివాహం, విదేశం

మీకు విదేశ గమనానికి అంతగా అనుకూల స్థితి లేదు కానీ ప్రయత్నించొచ్చు, మీకు వివాహ పరంగా 8వ అధిపతి శని 7వభావాన్ని చూడటం. కొంత ఇబ్బందికరం. శని, కుజలకి పరిహారంచేసుకోండి.

10.కృష్ణారావు, కృష్ణాజిల్లా, సెటిల్‌మెంట్‌

మీరనుకున్నసెటల్‌మెంట్‌ నిజానికి మాకు తెలియదు, అవి చర్చించేవి కానీ ఇలా సూచనలిచ్చే చిన్నవేదికలో అందించేవి కావు.పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి. ఇక రెండోది ధరించాల్సినవి పచ్చ,వజ్రం నేత్నాలు. ఐతే ఒకమాట. ఇవి మంచివి మీకు కానీ, వీటితోనే కలిసొస్తాయనే మూర్ఖత్వంలో ఉండకండి. ఇవి సహకరిస్తాయి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి అంతే.

11. పి.మనోజ్‌ రాఘవ, అనంతపూర్‌, ఉద్యోగం

మీరు రాహువు పరిహారంచేసుకోండి. ఆగస్ట్‌ తర్వాత ప్రయత్నించండి.

12.రామసంతోష్‌, రాజమండ్రి, 4ప్రశ్నలుఅడిగారు

ఇన్నింటికి చెప్పడం కుదరదు కానీ మీరనుకున్నసెటల్‌మెంట్‌ నిజానికి మాకు తెలియదు, అవి చర్చించేవి కానీ ఇలా సూచనలిచ్చే చిన్నవేదికలో అందించేవి కావు. పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జ్యోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి. ఇకరెండోది ఆరోగ్యం మీకు 6లో శుక్ర చంద్రులుండటం ఒక కారణం , రాహువు దశనడవడం రెండోకారణం. వీటికి పరిహారం చేసుకోండి.

13. వాక సుబ్బారెడ్డి,నెల్లూరు, ఆరోగ్యం , సెటిల్‌మెంట్‌

పుట్టిన సమయం రాయలేదు. నక్షత్రం కూడా రాయలేదు. ఆరోగ్యంవంటి వాటి గురించి చెప్పడం కుదరదు. ఇక మీ రెండో ప్రశ్న మీరనుకున్నసెటల్‌మెంట్‌ నిజానికి మాకు తెలియదు,అవి చర్చించేవి కానీ ఇలా సూచనలిచ్చే చిన్నవేదికలో అందించేవి కావు. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.

14. పి.శివశంకర్‌ , పుట్టినచోటురాయలేదు, భవిష్యత్తు

భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం. అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు .ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

15.వేంకటరాజేష్‌ రామనాథం, చెరుకుపల్లి

మీకు ప్రభుత్వోద్యోగానికి అనుకూలతల కంటే ప్రతికూలతలెక్కువగా ఉన్నాయి. సూర్య, చంద్ర, కుజ, రాహువులకి పరిహారాలు చేసుకోండి.ఇక మీరెండో ప్రశ్న భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాలా విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+