జ్యోతిషం: విదేశాలకు వెళ్లలేమా, ఎలా?
1.శ్రావణి మమత,సంతానం
మీజాతకంలో దోషాలేంటి అనేది చూడటానికి ఇద్దరివివరాలూ పంపాలి,కానీ మీరు పంపలేదు ,మీవివరాలు పంపితే దోషమెక్కడిదో చూసిచెప్పగలం,సంతానంకోసం ' నవగ్రహపరిహారాలు' అనే ఆర్టికల్‌లో ఒక ప్రార్థన చెప్పాం అదిచేస్తూండండి.
2.యన్.మహేష్‌కుమర్,1985(పుట్టినచోటు సమయంరాయలేదు)
రాశి,భవిష్యత్తుఇలాంటివి చెప్పడం ఎలాకుదురుతుంది?
3. ఖండెభాస్కర్, పుట్టిన చోటు, సమయం రాయలేదు, వ్యాపారం
మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారు. అసలు సమస్యేంటో రాయలేదు. ముందు మేం ప్రశ్నలడగానికి ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. తర్వాత పంపండి.
4.యర్రవెల్లి వేణు,కరీంనగర్,జీతం
మీరు వివరాలైనా, నక్షత్రమైనా పంపాలి, దానాలుచేస్తూ లక్ష్మీదేవి స్తోత్రం చదువుతూండండి.

5.ఆనంద్ గుండ,నాగార్జునసాగర్,విదేశాలకు
వెళ్లడాని అవకాశాలు తక్కువగా ఉన్నాయి, కానీ కొంత ఆశించి ప్రయత్నించవచ్చు.
6.వాసుఅమ్మినేని,నవ్యల సంతానం
మీ ఇద్దరికీ 5లో 8వ అధిపతి ఉన్నాడు (వాసు అని రాహువులకి, నవ్య గురు రాహువు కేతువులకి పరిహారంచేసుకొని) సంతానంకోసం చెప్పిన ప్రార్థన చేస్తూండండి. అంటే ఏంచేయాలో నవ గ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.
7.ధనుంజయ్ వడ్డె,ప్రభుత్వోద్యోగం,బెల్లరి(కర్నాటక)
మీకు ప్రభుత్వోద్యోగం పొందే అవకాశం ఉంది, కానీ మీ బద్ధకం నిర్లక్ష్యం వల్ల చాలా కోల్పోతారు శనికి దానాలు పరిహారాలు చేస్తూండండి. అంటే ఏం చేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.మిగిలి ప్రశ్నలన్నింటికి సమాధానాలు కుదరదు. ఒకప్రశ్న అడగండి.
8.సీతారాం, హైదరాబాద్, కుజదోషం
మీకు కుజదోషం ఉంది.
9.కంచర్లపల్లి వెంకటరమణ
మీకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మంచిదే, మీకు ఉద్యోగభావానికి అష్టక వర్గ బలం బాగుంది, ఆర్థిక స్థితి కూడా బాగుంటుంది.
10. ఆనందసూర్య, అమెరికా, కుమారునిపేరు
మీ కుమారునికి జనన కాల దోషం లేదు, ర అనే అక్షరంతో మొదలయ్యే సరి సంఖ్యలోని పేరు పెట్టుకోండి.
11. ప్రవీణ్, సిరిసిల్ల, విదేశగమనం
మీకు విదేశగమనానికి అవకాశం లేదు.
12.రమ్యకుమారి, తెనాలి, వివాహం
మీకు వచ్చేసంవత్సరం వివాహ గ్రహానుకూలత ఉంది.
13. రాజేష్ కుమార్, రాజమండ్రి, ఉద్యోగం
మీకు వృత్తిస్థానంలో రాహువు, 8వఅధిపతి కుజుడు 7లో ఉండి లగ్నాన్ని చూడటం వంటి ఇబ్బందులున్నాయి,మీరు చాలాశ్రమించాలి కొంతలో అవకాశాలు పోతాయి, పై గ్రహాలకి శాంతి పరహారాలుచేస్తూ, దానాలిస్తూ, వివాహానికి చెప్పిన జపంచేస్తూండండి.అంటే ఏంచేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.
14. హనుమంతు, వేములవాడ, విదేశం
మీకు విదేశగమనానికి అవకాశం లేదు.
15. పవన్ ఆలగొండ, వైవాహిక జీవితం బాగాలేదు
పుట్టిన ఏ వివరాలూ ఇవ్వలేదు, వైవాహిక జీవితానికి అనేక కారణాలుంటాయి. ఇద్దరి వివరాలూ పంపండి, వివరాలు లేకపోతే దానధర్మాలు చేస్తూండండి,కూర్చుని మాట్లాడండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications