జ్యోతిషం: పెళ్లికి ఆగాల్సిందేనా, తప్పదా...
1.పద్మ.యల్, హైదరాబాద్, వివాహం
మీకు వివాహభావంలో పాపగ్రహాలున్నాయి. లగ్నం బలంగా లేదు. దశ బాగానే నడుస్తుంది. కానీ గోచారం బాగాలేదు మొత్తానికి టైం బాగాలేదు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకూ ఆగాలి. గురు ,శని,రాహువులకి పరిహారం చేసుకోండి.శుభం
2.ప్రదీప్ దర్భ, గుంటూరు, విదేశగమనం
మీకు విదేశగమనానికి అవకాశం లేదు
3.అంజయ్య (కుమార్తె అలేఖ్య వివాహం గురించి)మ్యారేజ్ మ్యాచింగ్
కుమార్తెకి సంతాన బలం తక్కువగా ఉందియ అబ్బాయికి బాగుంది కాబట్టి వివాహం చేయవచ్చు, అమ్మాయికి కుజపరిహారం చేసుకోండి.
4.సునందవర్మ, బెంగుళూరు, సంతానం గురించి
మీ జాతకంలో 5వ భాగం బాగుంది. మీ జాతకంలో అంతా బాగుంది. మీ భర్త వివరాలు పంపండి.
5.వర్ష, వి,హైదరాబాదు, ప్రేమవివాహం
మీకు ప్రేమవివాహం అవడానికి అవకాశం ఉంది.
6. సింధూర, కెరియర్
పేరాల కొద్దీ ప్రశ్నరాసి వివరాలు మరిచిపోయారు. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
7. యం.వి.వి.ఆర్.శర్మ, ఢిల్లీ, ట్రాన్స్‌ఫర్
మీకు వచ్సే సంవత్సరం ట్రాన్స్‌ఫర్‌కి అవకాశం ఉంది కానీ అది స్వంత ఊరుకని చెప్పలేం.

8.మహేశ్వరి, ఒంగోలు, కెరియర్
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి .చదివి మీప్రశ్న పంపండి.
9. అరవింద్ అగర్వాల్, హైదరాబాద్, వ్యాపారం
లక్ష్మిపూజ, కనకధారా స్తోత్ర పారాయణ వంటివి చేయడం వల్ల ధనం సిరత్వమగుతుంది. మంచి ఫలితాలు పొందుతారు.
10. గంగా ప్రసాద్, వివాహం
మీకు వివాహానికి కొంత ఆలస్యమవడానికి కారణం7వ భావం కన్నా లగ్నం బలహీనం కావడం గురుబలం లేకపోవడం ఒక సంవత్సరం ఆగండి. తర్వాత ప్రయత్నించండి.
11.శరణ్య,తూగో,కెరియర్
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి.చదివి మీ ప్రశ్న పంపండి.
12. జగదీష్ రెడ్డి, మేడ్చల్, వీధిపోట్
ఇంటికి వీధిపోటు ఉంటే మీరు అడ్డంగా చెట్టు కానీ వినాయక విగ్రహం కానీ ఉంచాలి.
13.దత్తాత్రేయ,నిజామాబాద్,ప్రభుత్వఉద్యోగం
మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం సరిగ్గా లేదు.
14. చందన, హైదరాబాద్, ప్రేమవివాహం
మీకు ప్రేమవివాహానికి అవకాశం తక్కువగా ఉంది.
15.చందన ప్రసాద్,ద్వితీయ వివాహం
మీ వివరాలు సరిగ్గా ఇవ్వలేదు ద్వితీయ వివాహానికి ముందు జాతకాలు, ఆలోచనలు చూసుకొని వివాహం చేసుకోండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications