అందుకు భార్య జాతకం కూడా చూడాలా?
1.(3 )రంజిత్ రెడ్డి కొండూరు, ప్రభుత్వ ఉద్యోగము
మీకు రావడానికి రాకపోవడానికిగల ఆటంకాలు రెండూ సమానంగా ఉన్నాయి. దాన ధర్మాలు చేస్తూ పుణ్యబలం పెంచుకోండి.
2. అరవింద్ కుమార్, కదిరి, ప్రభుత్వ ఉద్యోగము
మీకు జాతకంలో అనుకూలత తక్కువగా ఉంది.
3. సాయికిరణ్ పెద్దాడ, ఆకివీడు, ప్రభుత్వ ఉద్యోగము
మీకు జాతకంలో అనుకూలత తక్కువగా ఉంది, పుణ్యకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉండడి. రవి, రాహువులకి దానాలు పరిహారాలు చేసుకుంటూ ఉండండి.
4. నర్సింగ రావు, బొబ్బిలి, ప్రభుత్వ ఉద్యోగము
మీకు ప్రభుత్వ ఉద్యోగానికి చాలాబాగా అవకాశాలున్నాయి, శని వ్యయాధిపతి చంద్ర దృష్టి ఉంది, దానిఫలితంగా కొద్దిపాటిలో మిస్ కావచ్చు, ఆనికి దానాలు శాంతులు చేసుకోండి.
5. లక్ష్మి నరసింహ, ములుగు, ప్రభుత్వ ఉద్యోగము
మీకు ప్రభుత్వ ఉద్యోగానికి చాలాబాగా అవకాశాలున్నాయి, కేతు, రాహు దుష్ప్రభావం ఉంది, దానిఫలితంగా కొద్దిపాటిలో మిస్ కావచ్చు, ఆనికి దానాలు శాంతులు చేసుకోండి.
6. పొనుగుమాటి వెంకటేశ్వర రావు, హనుమాన్ జంక్షన్, ప్రేమవివాహం
మీకు ప్రేమ వివాహం కావడానికి అనుకూలత లేదు.
7.అరవింద్ కుమార్. కదిరి, ప్రేమవివాహం, ప్రేమవివాహం
మీకు ప్రేమ వివాహం అవడానికి అవకాశాలున్నాయి. చాలా వరకు అవి సమస్యలతో ఉండవచ్చు, లేదా వివాహం జరగక పోవచ్చు.
8.మోహన్ కృష్ణ, అమలాపురం, వివాహం
లెక్కకి ఆగస్ట్ తర్వాత సెట్ కావాలి. శుక్ర, రాహువుల దుష్ప్రభావాల కారణంగా. ఆటంకాలు కలుగుతాయి. పైగ్రహాలకి శాంతి పరిహారాలు చేసుకోండి. వివాహానికిచ్చిన శ్లోకాన్ని చదవండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
9.సాయి కిరణ్, ఖమ్మం, వివాహానికి ఏనక్షత్రం సరైనది?
చాలా ఉన్నాయి, నషత్రం కంటే మాంగల్యదోషం, సంతాన దోషం వంటివి, వధువు వివరాలు ఇస్తే చూసి చెప్పేవే కానీ. వివరిస్తూ పోతే పది పేజీలైనా చాలవు.

10.నాగరాజు ఇసకాపల్లి, ఒంగోలు, వివాహం
లెక్కకి ఆగస్ట్ తర్వాత సెట్ కావాలి. కేతు, రాహువుల దుష్ప్రభావాల కారణంగా. ఆటంకాలు, ఆలస్యం జరుగుతాయి. పైగ్రహాలకి శాంతి పరిహారాలు చేసుకోండి. వివాహానికిచ్చిన శ్లోకాన్ని చదవండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
11. బాలాజి బాను, దాంపత్య సమస్యలు
మీరు వివరాలివ్వలేదు కానీ అవగాహన, ఆవశ్యకత లేకపోతే దాంపత్యం సాగదని మీకూ తెలుసు, కానీ పెద్దలతో మాట్లాడి సరిదిద్దుకోడి, ఇందులో జ్యోతిష్కులని ఎంతమందిని కలిసినా జేబు నింపుకుంటారు కానీ. మంచి మాట చెప్పరు.
12. రమేష్, కామారెడ్డి, ఆరోగ్య సమస్యలు
6లో గురుడు ఉన్నాడు, కుజుడిలో రాహువుదశ నడవడం కొంత ఇబ్బందిని కలిగించేదే గురుని వల్ల షుగర్ వంటి దీర్ఘరోగాలు రావచ్చు. ఐతే ఏలినాటిశని ప్రారంభ దశలో ఉంది, ఐతే వీటికి ఎప్పుడూదానాలు చేస్తూ క్రీం అచ్యుతానంత గోవింద అని జపిస్తూ ఉండండి.
13. సింహాద్రి తేజో మూర్తి, అమలాపురం, భార్యా భర్తలగొడవలు
వివాహ భావంలో 8వ అధిపతి చంద్రుడితో కలిసి ఉన్నాడు, గొడవలు అశాంతి ఉంటుంది, ఐతే మీ భార్యజాతకం కూడా చూడాలి, అవగాహన తో మాట్లాడుకోండి, వీటికి దానాలు చేసుకోండి.
14. కొంత మంది అడిగిన ప్రశ్నలలో కొందరు సరిగ్గా ఇవ్వలేదు. జవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్ చదివి పంపండి.
సుజాత పల్ల, విశాఖపట్నం, సమయం రాయలేదు.
తులసీ సూర్య ప్రకాష్, స్వంత ఇల్లు పుట్టిన చోటు, సమయం రాయలేదు.
విజయ్ కుమార్ జంగ, ఆర్థిక సమస్యలు పుట్టిన చోటు, సమయం రాయలేదు
సత్యం సురుగు, 26.01.1979 పుట్టిన చోటు, సమయం రాయలేదు
పి. శ్రీకాంత్, 01-03-1987
పుట్టిన చోటు, సమయం రాయలేదు
ఉడిమూడి వరకుమార్, స్వంత ఇల్లు
పుట్టిన చోటు, సమయం రాయలేదు
పి. శివకుమార్, నెల్లూరు,
ఆరోగ్య సమస్యలు అని హెడ్డింగ్ రాసారు ఏం ఇబ్బందో ఎప్పటినుండో రాయలేదు.
దేవరాజు ములిగె,1977
పుట్టిన చోటు, సమయం రాయలేదు
గురునాథ్ రెడ్డి 15 - 5 - 1986
పుట్టిన చోటు, సమయం రాయలేదు
ఆదర్శ్ రావు, నెల్లూరు,
హెడ్డింగ్ రాసారు ఏం ఇబ్బందో ఎప్పటినుండో రాయలేదు.
వెంకట సంజీవ్ కుమార్
హెడ్డింగ్ రాసారు ఏం ఇబ్బందో ఎప్పటినుండో రాయలేదు.
మురళి శ్యామ్, 23/06/1971
పుట్టిన చోటు, సమయం రాయలేదు
హర్షిత్, తిరుపతి, 19-04-1989
పుట్టిన చోటు, సమయం రాయలేదు
15.భవిష్యత్తు, కెరియర్ల గురించి ప్రశ్నలు
ఇంద్ర సేన,
రామ్ కుమార్ పెండ్యాల
లక్ష్మినారాయణ, విశఅఖ పట్ణం
ఆది వెంకట ప్రతాప్ రెడ్డి
బలిజే పల్లి రమేష్‌బాబు
చంద్రమౌళి 28.08.1985
మా వెబ్ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలికదా.ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని, సూచనలు చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications