జ్యోతిషం: వివాహపరంగా సమస్య ఉందా?

1.తంగెళ్లపల్లి నరేష్‌కుమార్‌,మీరుపుట్టినచోటురాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం

మీకు 5లో 8వఅధిపతి ఉన్నాడు. దానివల్ల అంతగా రాణించదు.(గురునికి దానాలు, పరిహారాలు చేసుకోండి) కొంత నయమవుతుంది. ఆపరిహారాలు విడిగా ఒక ఆర్టికల్‌ లో అందించాం.

2.యం.మోహన్‌ కిషోర్‌ పిళ్లై,ఉద్యోగం -

నక్షత్రమైనా, పుట్టినచోటు, పుట్టినసమయం ఐనా పంపండి.

3.ఓంప్రకాష్‌, ఏకనక్షత్రీకుల వివాహం,

కేవలం నక్షత్రం విషయం చూస్తే ఇద్దరివీ రోహిణీ నక్షత్రం ఐతే వివాహం చేసుకోవచ్చు.

4.లలితాదేవి, హైదరాబాద్‌, మాంగళ్యదోషం

మీకు మాంగల్యదోషంలేదు, అసలు మాంగల్య దోషం వల్ల వివాహమ జరగదు అనే మాట అబద్ధం.

5.గురుప్రసాద్‌,ధనిష్ఠ నక్షత్రం,వివాహం

వివరాలు ఇవ్వలేదు కానీ ధనిష్ఠనక్షత్రం అన్నారు. ధనిష్ఠలో1,2పాదాలు మకర రాశి,3,4 పాదాలు కుంభరాశి అవుతుంది మీరు పాదం చెప్పలేదు. కుంభరాశి ఐతే రాహు, కేతువులకి దానపరిహారాలు చేసుకోవాలి ఈ ఏడాది వివాహం అవుతుంది. మకరరాశి ఐతే శనిదృష్టిప్రభావం ఉంటుంది. వివాహానికి ఇంకో ఏడాది ఆగాలి.

Ask Your Astrologer: He answered your questions

6. రమేష్‌ మేడి,వరంగల్‌, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగం రావడానికి గ్రహానుకూలత ఉంది.

7.రామ్‌కి కావేరి, చిలకలూరిపేట, వివాహం

మీకు 8వ అధిపతికుజుడు 7ని(వివాహ భావాన్ని) 8వదృష్టితో చూస్తున్నాడు, ఒక సంవత్సరం వరకు ఆగాలి వివాహం అయ్యేదాకా కుజుని దానాలు, పరిహారాలు చేస్తూండండి ప్రార్థన శ్లోకం చదువుతూ ఉండండి. అవన్నీ నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

8. విశ్వంత్‌, ఇంటికి ఏ ద్వారం

మీరిచ్చిన వివరాలప్రకారం ఉత్తరం మంచి ముఖద్వారం

9. కర్ణాకర్‌ వెంగల, కరీంనగర్‌, ఉద్యోగం

ఒక ప్రశ్న అడగండి ఇన్ని అడగకూడదు పైనా ఒకటి చెబుతున్నాం. మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశం ఉంది కానీ మీ స్వంత దోషం వల్ల పోయే అవకాశం ఉంది, సాధన ఎక్కువ చేయండి. ప్రేమపెళ్లికి ఛాన్స్‌లేదు.

10. కృష్ణమూర్తి వెలగందుల, కడప, ప్రమోషన్‌

మీకు వచ్చేఫిబ్రవరి దాటితే ప్రమోషన్‌ వస్తుంది.

11.వేణుధనకొండ,తిరుమల,రాజకీయజీవితం
మీకు రాజకీయంగా ఫాలోవింగ్‌ బాగుంటుంది కానీ రాణించలేరు,ప్రశాంతతక్కువగా ఉంటుంది.

12.రామకృష్ణ, బెంగుళూర్‌, మ్యారేజ్‌ మ్యాచింగ్‌

వివాహ పొంతన కలిసింది, సంతానబలం బాగుంది, చేసుకోవచ్చు.

13.సత్యనారాయణశాస్త్రి, ఒంగోల్‌, దాంపత్యంలో సమస్య

మీరిద్దరివీ షష్టాకాలు,ఇద్దరి జాతకంలో వివాహభావంపైన పాపగ్రహాల ప్రభావం ఉంది, అసలు సమస్య ఎక్కడుందో చెప్పలేదు, దానాలు పరిహారాలు చేసుకునే ముందు, సమస్యేంటో కూర్చుని తేల్చుకోండి, అన్నీ పూజల ద్వారా తీరవు.

14.శ్రీదేవి కొర్నపాటి, సంతానం

మీ భర్త జాతకం కూడా పంపాలి.

15. దాసరి ఆంజనేయులు, విజయవాడ (కుమార్తె వెంకటవిజయలక్ష్మి జాతకం గురించి అడిగారు)

మీ కుమార్తెకి సూర్యుడు నీచలోఉన్నాడు, ప్రభుత్వోద్యోగానికి అనుకూలత అంతగాలేదు, ఇక వివాహం మాంగల్య దోషం ఉంది. వివాహం పరంగా సమస్య ఉంటుంది ఇప్పటికే కొంత ఆలస్యమవడం జరిగింది కాబట్టి, రాహు గురులకి పరిహారంచేసుకోండి. ప్రార్థన శ్లోకం చదువుతూ ఉండండి. అవన్నీ నవగ్రహ పరిహారాలు అనే ఒక ఆర్టికల్‌ లో విడిగాఅందించాం.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+